వరుణ్ ధావన్, సారా అలీఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'కూలీ నెం 1'. డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించడం సహా నిర్మించారు. వాసు భగ్నానీ సహ నిర్మాత. ఈ చిత్రం ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో దీపావళి సందర్భంగా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. అయితే దీనిని డిజిటల్ మాధ్యమంలో రిలీజ్ చేస్తుండటం యూనిట్‌లోని పలువురికి ఇష్టం లేదని సమాచారం.
ఓటీటీలో సినిమా విడుదల వరుణ్‌కు ఇష్టం లేదా? - Varun Dhawan latest news
తను నటించిన 'కూలీ నం.1'.. ఓటీటీలో విడుదలవడం హీరో వరుణ్ ధావన్‌కు ఇష్టం లేదట. దర్శకనిర్మాతలు మాత్రం దానివైపే మొగ్గు చూపుతున్నారు.
![ఓటీటీలో సినిమా విడుదల వరుణ్‌కు ఇష్టం లేదా? Varun Dhawan and Dad David Disagree About Releasing Coolie No 1 on OTT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9093310-1036-9093310-1602126779562.jpg)
వరుణ్ ధావన్ సారా అలీ ఖాన్
వాసు భగ్నానీ, డేవిడ్ ధావన్ సినిమాను డిజిటల్ మాధ్యమంలో విడుదల చేస్తే ప్రయోజకరంగా ఉంటుందని అనుకుంటున్నారు. కానీ, వరుణ్ ధావన్‌కు ఇష్టం లేదని బాలీవుడ్ మీడియా అంటోంది.
1995లో విడుదలైన కూలీ నెం 1 చిత్రాన్ని, ఇప్పుడు అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ ఏడాది మేలోనే థియేటర్లలోకి రావాల్సింది కానీ అవి తెరుచుకోకపోవడం వల్ల దీపావళికి వాయిదా వేశారు.