మెగాహీరో వరుణ్‌తేజ్.. 'వాల్మీకి' సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటోందీ చిత్రం. ఇందులో 'గద్దలకొండ గణేశ్' అనే పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు వరుణ్. ప్రస్తుతం ట్రైలర్ రూపొందించే పనుల్లో ఉంది చిత్రబృందం. ఇందుకు సంబంధించి ఓ ఫొటోను ట్విట్టర్లో పంచుకున్నాడు దర్శకుడు హరీశ్ శంకర్.
'గద్దలకొండ గణేశ్'గా మారిన మెగాప్రిన్స్ - pooja hegdhe
వాల్మీకి సినిమాలో వరుణ్‌తేజ్ పాత్ర పేరును వెల్లడిస్తూ ఓ ట్వీట్ చేశాడు దర్శకుడు హరీశ్ శంకర్. త్వరలో ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు చెప్పాడు.
హీరో వరుణ్ తేజ్
'వాల్మీకి'లో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఇతర పాత్రల్లో అధర్వ మురళి, మృణాళిని రవి కనిపించనున్నారు. మిక్కి జే మేయర్ సంగీతమందిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: 'గ్యాంగ్‌లీడర్ టైటిల్ ఆలోచన అతడిదే'
Last Updated : Sep 29, 2019, 9:10 PM IST