తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దసరా కానుకగా 'వరుడు కావలెను'.. 'ఖిలాడి' షూటింగ్ పూర్తి - Kangana Ranaut Movies

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'వరుడు కావలెను', తలైవి(Thalaivi Ott), ఖిలాడి, జేమ్స్​ బాండ్(నో వే టూ హోమ్​), రొమాంటిక్ చిత్రాలకు సంబంధించిన విశేషాలు ఉన్నాయి.

movie latest updates
సినిమా వార్తలు

By

Published : Sep 25, 2021, 1:01 PM IST

నాగశార్య, రీతూవర్మ జంటగా నటించిన కుటుంబ కథాచిత్రం 'వరుడు కావలెను'(varudu kaavalenu). ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబరు 15న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కొత్త పోస్టర్​ను విడుదల చేసింది. ఈ చిత్రానికి లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించగా, సితార ఎంటర్​టైన్​మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మించారు.

.

ఓటీటీలో 'తలైవి'..

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథతో రూపొందిన పాన్ ఇండియా చిత్రం 'తలైవి'(Thalaivi Ott). ఏ.ఎల్.విజయ్ దర్శకత్వం వహించగా కంగనా రనౌత్ (Kangana Ranaut Movies) టైటిల్ రోల్​ చేశారు. ఇటీవల థియేటర్లలో విడదులైన ఈ చిత్రాన్ని సెప్టెంబరు 26(ఆదివారం) ఓటీటీలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

.

ప్రముఖ ఒటీటీ ఫ్లాట్​ఫామ్​ నెట్​ఫ్లిక్స్​లో విడుదల కానుంది. ఈ సినిమాలో ఎంజీఆర్​గా అరవింద్ స్వామి.. కరుణానిధి పాత్రలో ప్రకాశ్​ రాజ్ నటించారు. శశికళగా పూర్ణ నటించారు. జీవీ ప్రకాశ్​ స్వరాలందించారు. విష్ణు ఇందూరి శైలేష్ ఆర్. సింగ్ సంయుక్తంగా నిర్మించారు.

'ఖిలాడి' షూటింగ్​ పూర్తి..

మాస్‌ మహారాజ్‌ రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'ఖిలాడి'(Raviteja Khiladi). రమేశ్ వర్మ దర్శకుడు. రెండు పాటలు మినహా.. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు చిత్రబృందం ప్రకటించింది. పెన్ స్టూడియోస్‌, ఎ స్టూడియోస్ ఎల్ఎల్పీ కలిసి నిర్మిస్తున్న చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. డింపుల్‌ హయాతీ, మీనాక్షి చౌదరి హీరోయిన్లు.

.

నవంబరులో 'రొమాంటిక్'

ఆకాశ్ పూరీ, కేతిక శర్మ జంటగా నటించిన సినిమా 'రొమాంటిక్'. పూరీ జగన్నాథ్.. కథ, స్క్రీన్​ప్లే, మాటలు అందించగా.. అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. ఛార్మి, పూరీ జగన్నాథ్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే వచ్చిన పాటలు, పోస్టర్లు అలరిస్తున్నాయి.

.

జేమ్స్​బాండ్ త్రీడీలో..

జేమ్స్‌ బాండ్‌ సిరీస్​లో 25వ సినిమాగా తెరకెక్కిన 'నో టైమ్‌ టు డై'(No Time To Die Release Date) సెప్టెంబర్​ 30న భారత్​లో విడుదల కానుంది. అక్టోబర్​ 8న అమెరికాలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. ఈ చిత్రం 2డీ, 3డీ, 4డీఎక్స్, ఐమాక్స్ వెర్షన్​ల్లో విడుదల కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఇప్పటికే రిలీజైన ఫైనల్‌ ట్రైలర్‌ విపరీతంగా ఆకట్టుకుంటోంది.

.

ఇదీ చదవండి:బ్లాక్​బస్టర్​ రీమేక్​తో చిరు, నాగ్​ మల్టీస్టారర్!

ABOUT THE AUTHOR

...view details