'చూసి చూడంగానే' చిత్రానికి శివ కందుకూరి హీరో, శేష సింధు రావ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది హీరోయిన్ వర్ష.
ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?
వర్ష:ఇందులో నేను శ్రుతి అనే యువతి పాత్ర పోషిస్తున్నా. డ్రమ్మర్, మ్యూజిక్ డైరెక్టర్‌గా కనిపిస్తా. కథానాయకుడితో సరిసమానమైన ప్రాధాన్యమున్న పాత్రలో నటించా.
డ్రమ్మర్‌గా కనిపించేందుకు ఎలా సిద్ధమయ్యారు?
వర్ష:డ్రమ్మర్ పాత్ర గురించి చెప్పినప్పుడు కాస్త భయపడ్డా. ఎందుకంటే ఇప్పటి వరకు నేను చేసినవన్నీ సున్నితమైన పాత్రలు. ఈ తరహా పాత్ర చెయ్యగలనో లేదో అనుకున్నా. కానీ, నిర్మాతలు, దర్శకురాలు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చారు. ఈ చిత్ర సెట్స్‌లోకి అడుగుపెట్టేముందు కాస్త శిక్షణ కూడా తీసుకున్నా.
'చూసీ చూడంగానే' కథ ఏంటి?
వర్ష:ఈ కథలో చాలా కోణాలున్నాయి. శేష సింధు మనసుకు హత్తుకునేలా తెరకెక్కించారు. ప్రతి ఒక్కరినీ ఈ సినిమా ఆకట్టుకుంటుంది.