హీరోయిన్గా, నటిగా గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్‌కుమార్.. వినూత్న ప్రయత్నానికి సిద్ధమైంది. తమిళ సినిమా 'కన్నమూచి'తో దర్శకురాలిగా మారింది. ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆదివారం విడుదల చేశారు. పలువురు కోలీవుడ్ స్టార్స్ ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతూ దానిని పంచుకుంటున్నారు.
థ్రిల్లర్ కథతో దర్శకురాలిగా మారిన హీరోయిన్! - Varalaxmi Sarathkumar news
తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్.. దర్శకురాలిగానూ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. థ్రిల్లర్ కథతో ఈమె సినిమా తీస్తోంది.
![థ్రిల్లర్ కథతో దర్శకురాలిగా మారిన హీరోయిన్! Varalaxmi Sarathkumar to make her debut as director](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9220288-874-9220288-1603008497650.jpg)
నటి వరలక్ష్మి శరత్ కుమార్
థ్రిల్లర్ కథాంశంతో, మహిళలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో సినిమా ఉండనుందని పోస్టర్ చూస్తే తెలుస్తోంది. వరలక్ష్మి ఇందులో టైటిల్ రోల్ కూడా పోషిస్తుందట. తెన్నాండల్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. సామ్ సీఎస్ సంగీతమందిస్తున్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.