స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్- కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమాను ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం 'పుష్ప'తో బిజీగా ఉన్న బన్నీ.. ఇది పూర్తయిన తర్వాత కొరటాలతో కలిసి పనిచేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ విషయం ఆసక్తి కలిగిస్తోంది.
బన్నీ-కొరటాల సినిమాలో 'క్రాక్' జయమ్మ! - Allu Arjun movie news
అల్లు అర్జున్ కొత్త సినిమాలో ప్రముఖ తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్ర పోషించనున్నారని సమాచారం. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అల్లు అర్జున్
నటుడు శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మి ఈ సినిమాలో కీలకపాత్ర పోషించనున్నారని సమాచారం. 'క్రాక్'లో జయమ్మగా, 'నాంది'లో ఆద్యగా మెప్పించి తెలుగువారికి చేరువైన వరలక్ష్మి.. బన్నీ సినిమాలో రాజకీయ నాయకురాలిగా కనిపించనున్నారని నెటిజన్లు చెప్పుకుంటున్నారు. ఈ విషయమై చిత్రబృందం ఇప్పటికే ఆమెను సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇది చదవండి:కిక్ బాక్సింగ్‌తో బిజీ.. కారణం చెప్పిన రాశీ
Last Updated : Mar 1, 2021, 9:23 AM IST