తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వెబ్​సిరీస్​ తెరకెక్కించబోతున్న వంశీ పైడిపల్లి! - వంశీ పైడిపల్లి అల్లు అరవింద్​ సినిమా

త్వరలోనే దర్శకుడు వంశీ పైడిపల్లి.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్​తో కలిసి వెబ్​సిరీస్​ను తెరకెక్కిస్తున్నట్లు టాక్​. ఇందుకోసం వీరిద్దరి మధ్య చర్చలు కూడా జరిగినట్లు సమాచారం.

vamsi
వంశీ

By

Published : Jun 1, 2020, 10:22 PM IST

మహేశ్​బాబు-వంశీ పైడిపల్లి కాంబోలో రానున్న సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల ఇటీవల పట్టాలెక్కకుండా ఆగిపోయింది. కారణం ఏదేమైనప్పటికీ వంశీ.. మహేశ్ కోసం సిద్ధం చేసిన కథకు తుది మెరుగులు దిద్దే పనిలో పడ్డాడట. అయితే ప్రస్తుతం పరశురామ్​ దర్శకత్వంలో ప్రిన్స్​ 'సర్కారు​ వారి పాట' సినిమా చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలో సూపర్​స్టార్​-వంశీ సినిమా మళ్లీ సెట్స్​పైకి వెళ్లడానికి చాలా సమయం పడుతుంది.

అయితే ఈ సమయంలో వంశీ రెండు వెబ్​సిరీస్​లు​ తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నాడని టాక్​. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్​తో కలిసి ఈ సిరీస్​లు నిర్మించనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయని సమాచారం. అందులో ఒకదానికి వంశీనే దర్శకత్వం వహించనున్నాడట.

ఇదీ చూడండి : 'సోనూ.. నా భర్త నుంచి దూరం చేయవా'

For All Latest Updates

TAGGED:

vamsi

ABOUT THE AUTHOR

...view details