'సరిలేరు నీకెవ్వరు'తో బిజీగా ఉన్న సూపర్‌స్టార్ మహేశ్‌బాబు.. తర్వాతి సినిమా ఖరారైంది. తనతో 'మహర్షి' వంటి హిట్ చిత్రాన్ని తీసిన వంశీ పైడిపల్లికి మరో అవకాశమిచ్చాడు ప్రిన్స్. ఈ విషయాన్ని ధ్రువీకరించాడీ డైరక్టర్. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. గ్యాంగ్‌స్టర్ కథతో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్.. వచ్చే ఫిబ్రవరిలో మొదలుకానుందట.
గ్యాంగ్‌స్టర్‌గా సూపర్‌స్టార్ మహేశ్‌బాబు! - vamshi paidipally with mahesh babu
దర్శకుడు వంశీపైడిపల్లి-సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కాంబినేషన్లో మరో సినిమా రానుంది. వచ్చే ఫిబ్రవరి నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో మహేశ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నాడని టాక్.
దర్శకుడు వంశీపైడిపల్లితో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు
'సరిలేరు నీకెవ్వరు'లో ఆర్మీ మేజర్‌గా కనిపించనున్నాడు మహేశ్. కేరళలో చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది. రష్మిక హీరోయిన్. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. అనిల్ రావిపూడి దర్శకుడు. వచ్చే జనవరి 11న విడుదల కానుందీ చిత్రం.
ఇది చదవండి: సంక్రాంతి పోరులో బన్నీ జోరుగా.. మహేశ్ మెల్లగా