మెగాహీరో వరుణ్ తేజ్ తొలిసారిగా ప్రతినాయక పాత్రలో నటించిన సినిమా 'వాల్మీకి'. తమిళ సూపర్ హిట్ 'జిగర్తాండ'కు ఇది రీమేక్. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. కీలక పాత్రల్లో తమిళ నటుడు అధర్వ మురళి, మృణాళిని రవి కనిపించనున్నారు..
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ను వెల్లడించింది చిత్రబృందం. రేపు (సోమవారం) సాయంత్రం 4 గంటలకు చిత్ర ట్రైలర్ను విడుదల చేస్తామని ప్రకటించింది.