సినీప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న 'వాల్మీకి' చిత్రంలోని 'వెల్లువచ్చి గోదారమ్మా..' పాట ప్రోమో నేడు విడుదలైంది. 1982లో వచ్చిన 'దేవత' సినిమాలోని పాటను ఇందులో వాడారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల ఆలపించిన ఆ పాటను ఏ మాత్రం మార్చకుండా తీసుకున్నారు.
శోభన్ బాబు, శ్రీదేవి స్టెప్పులకు అప్పటి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. వీరి స్థానంలో వరుణ్‌తేజ్, పూజా హెగ్డే మెప్పించే ప్రయత్నం చేశారు. చక్రవర్తి సంగీతం సమకూర్చిన ఈ పాటను ఇప్పటికీ వింటున్నారు శ్రోతలు. అంతగా ఆకట్టుకుంది.