టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో రాబోతున్న 'వాల్మీకి' ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరగనుంది. శిల్పకళావేదికలో నేడు జరగనున్న ఈ వేడుకకు విక్టరీ వెంకటేశ్ ముఖ్య అతిథిగా రానున్నాడు.
'వాల్మీకి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెంకీమామ - వాల్మీకి
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'వాల్మీకి'. ఆదివారం ఈ సినిమా ముందస్తు విడుదల వేడకను హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా విక్టరీ వెంకటేశ్ హాజరుకానున్నాడు.
'వాల్మీకి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెంకీమామ
తమిళ చిత్రం 'జిగర్తాండ'కు రీమేక్‌గా రానుంది'వాల్మీకి'. ఇందులో వరుణ్.. ఘని అలియాస్ గద్దలకొండ గణేశ్ అనే ప్రతినాయకుడి ఛాయ ఉన్న పాత్ర పోషిస్తున్నాడు. పూజా హెగ్డే కథానాయిక. తమిళ నటుడు అధ్వర మురళీ కీలకపాత్రలో కనిపించనున్నాడు. రామ్ అచంట, గోపీ అచంట నిర్మాతలు. మిక్కీజే మేయర్ సంగీత దర్శకుడు. సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇదీ చూడండి: వెండి తెర నీలాంబరి.. ఈ శివగామి..!
Last Updated : Sep 30, 2019, 4:06 PM IST