తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వాలెంటైన్స్​ డే: ప్రేమకు వయసు అడ్డు కాదు! - బాలీవుడ్​ జంటలు

ప్రేమలో పడితే ఎవ్వరైనా స్వర్గంలో విహరిస్తుంటారు. కొంతమంది జీవితంలో ఆ ప్రేమను సాధించే క్రమంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటారు. వయసు, మతాల తారతమ్యాలు ఇలా ఎన్ని ఎదురైనా అవేవీ నిజమైన ప్రేమకు అడ్డుకాదని నిరూపించారు కొంత మంది తారలు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా బాలీవుడ్​లో ప్రేమతో ఒకటై జీవనాన్ని సాగిస్తున్న తారల జంటలపై ఓ లుక్కేద్దాం.

valentines day special Love has nothing to do with age
వాలెంటెన్స్​ డే: ప్రేమకు వయసు అడ్డు కాదు!

By

Published : Feb 14, 2021, 10:32 AM IST

ప్రేమ ఎన్నో భావోద్వేగాల కలయిక. హృదయాల వేదికగా సాగే జ్ఞాపకాల మజిలీ. ప్రేమించిన వారిని.. జీవిత భాగస్వామిగా పొందిన వారు ఎంతోమంది. దక్కించుకోలేక బాధపడుతున్న వారు మరి కొంతమంది. అయితే కొంతమంది సినీతారలు.. ప్రేమించిన వారికోసం జీవితంలో ఎదురైన ఎన్నో కష్టాలను అధిగమించి నిలిచారు. ఈరోజు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వారిలో కొంతమంది గురించి తెలుసుకుందాం.

వయసు అడ్డుకాదని..

మిలింద్​ సోమన్​, అంకితా కొన్వర్

ప్రేమకు హద్దులు లేవని నిరూపించిన జంటల్లో మిలింద్​ సోమన్​, అంకితా కొన్వర్​ ముందుంటారు. సమాజం ప్రేమకు వయసు వ్యత్యాసాన్ని చూపించినప్పటికీ.. ఎదురైన ప్రతి అడ్డంకినీ ఎదుర్కొని ఒక్కటైంది ఈ జంట. నెట్టింట వీరికి ఎదురైన ట్రోల్స్​, ప్రశ్నలను తిప్పికొట్టి ప్రేమకు ఏదీ అడ్డుకాదంటూ నిజమైన నిర్వచనం ఇచ్చారు.

పవర్​ కపుల్స్​..

ప్రియాంకా చోప్రా, నిక్​ జోనాస్

బాలీవుడ్​లో పవర్​ కపుల్స్​ విషయానికొస్తే ప్రియాంకా చోప్రా, నిక్​ జోనాస్​ జంట గురించి మాట్లాడుకోవాల్సిందే. అమ్మాయిలు ఎక్కువగా వారికంటే పెద్ద కుర్రాళ్లతో ప్రేమలో పడతారని అందరూ అంటుంటారు. కానీ ప్రియాంక ప్రేమాయణం అందుకు పూర్తి భిన్నం అనే చెప్పాలి. నిక్​, ప్రియాంక.. ఇద్దరి వయసు మధ్య వ్యత్యాసం ఎంతో తెలుసా?. 10 సంవత్సరాలు. ఈ జంట చాలదా ప్రేమకు వయసు ఒక అడ్డే కాదని నిరూపించడానికి.

వీళ్లూ అంతే..

అర్జున్​ కపూర్​, మలైకా అరోరా

ఇదే జోరుతో ప్రేమ ప్రయాణంలో అడుగులేసిన జంట అర్జున్​ కపూర్​, మలైకా అరోరా. వయసులో వీరిద్దరికి 9 ఏళ్ల వ్యత్యాసం ఉంది. సామాజిక మాధ్యమాల్లో ఎన్నో ట్రోల్స్ వచ్చినప్పటికీ వాటన్నిటికీ గట్టిగా సమాధానం చెప్తూ, ఒకటయ్యారు. సంతోషకరమైన జీవితాన్ని గడపాలంటే ప్రేమ ఒక్కటే చాలని నిరూపించారు.

ఆమిర్​ ప్రేమకథ..

ఆమిర్​​ ఖాన్​, కిరణ్​ రావు

తెరపై ఎంతోమంది కథానాయికలను ప్రేమించిన ఆమిర్​​ ఖాన్​.. నిజజీవితంలో కిరణ్​ రావు ప్రేమకు దాసోహం కాక తప్పలేదు. 2001లో 'లగాన్'​ షూటింగ్​ సమయంలో వీరిద్దరి చూపులు తొలిసారి కలుసుకున్నాయి. అప్పటికీ బలమైన బంధానికి సిద్ధంగా లేనప్పటికీ.. ఒకరిపై ఒకరికి తెలియకుండానే పుట్టిన ప్రేమ వారిద్దరినీ ఒకటి చేసింది. 2004లో పెళ్లిపీటలెక్కించింది.

సైఫ్​- కరీనా..

సైఫ్​ అలీఖాన్​, కరీనా కపూర్​

ఇక బాలీవుడ్​ రాయల్​ కపుల్​ సైఫ్​ అలీఖాన్​, కరీనా కపూర్​ల ప్రేమ కథను చూద్దాం. ఇద్దరి వయసు మధ్య 10 సంవత్సరాల వ్యత్యాసం ఉన్నప్పటికీ, ఇరువురి మతాలు వేరైనప్పటికీ అవేవీ ప్రేమకు అడ్డుకాదని నిరూపించారు. ఈ జంట పెళ్లితో ప్రేమ ప్రయాణాన్ని మొదలుపెట్టి నాలుగేళ్లవుతోంది.

సుస్మితా కాదల్​..

సుస్మితా సేన్​, రోహ్మాన్​ షాల్

సుస్మితా సేన్​, రోహ్మాన్​ షాల్​ జంట కూడా ప్రేమకు గొప్ప ఉదాహరణగా చెప్పుకోవాలి. ఇరువురి మధ్య 15 సంవత్సరాల వయసు అంతరం ఉన్నప్పటికీ ఎప్పుడూ వారికి అది ఆందోళన కలిగించలేదు. ఈ జంట ప్రేమపై నమ్మకాన్ని కలిగించడమే కాక, ఒకరికొకరు ఎలా కలిసి జీవించాలో చూపించారు.

దిలీప్​-సైరా..

దిలీప్​ కుమార్​, సైరా భాను

కొన్ని ప్రేమకథలు శాశ్వతమైనవని దిలీప్​ కుమార్​, సైరా భాను జంటను చూసినప్పుడు అనిపిస్తుంది. దిలీప్​ను కోహినూర్​ అని సైరా పిలిచేది. ఇద్దరి మధ్య 22 సంవత్సరాల వయస్సు తేడా ఉన్నప్పటికీ.. ప్రేమకు అవేవీ అడ్డుకాదని నిరూపించారు. సైరా తన 12ఏళ్ల వయసులో దిలీప్​తో ప్రేమలో పడ్డారు. 1966 లో వీరిద్దరికీ వివాహం జరిగింది.

షాహిద్​ లవ్​స్టోరీ..

షాహిద్ కపూర్​, మీరా రాజ్​పుత్​

2015లో వివాహ బంధంతో ఒకటైన షాహిద్ కపూర్​, మీరా రాజ్​పుత్​ జంట కూడా ప్రేమను గెలిచిన జంటల్లో ఒకటి. షాహిద్​కు మీరా కుటుంబసభ్యులు స్నేహితులు కావడం వల్ల కొన్ని సందర్భాలలో ఒకరినొకరు కలుసుకున్నారు. ఒకానొక సమయంలో తాను బాలీవుడ్ తారలను వివాహం చేసుకోవాలని అనుకోవడం లేదని షాహిద్​ పేర్కొన్నాడు. ఇరువురి మధ్య ఎన్నో సంభాషణల అనంతరం షాహిద్​ తనకు సరైన భాగస్వామి అని మీరా అనుకుంది.

షాకైన బాలీవుడ్​..

ఫరా​ ఖాన్​, శిరీష్​ కుందర్

ప్రేమకు మతం, వయసు అంతరాలు లేవని నిరూపించింది దర్శకురాలు- కొరియోగ్రాఫర్​ ఫరా​ ఖాన్​, శిరీష్​ కుందర్​ జంట. వీరిద్దరూ వివాహం చేసుకోవాలని అనుకున్నప్పుడు బాలీవుడ్​ మొత్తం షాక్​ అయ్యింది. ఫరా​ దర్శకత్వం వహించిన మెయిన్​ హూ నా సెట్స్​లో వీరి ప్రేమాయణం మొదలైంది. 2004లో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

వీరి కథా అంతే..

అర్జున్​ రాంపాల్​, గాబ్రియెల్లా డెమెట్రియేడ్

ప్రేమికులకు ఎంతో ఆసక్తి కలిగించే కథల్లో అర్జున్​ రాంపాల్​, గాబ్రియెల్లా డెమెట్రియేడ్​ జంట కూడా ఒకటి. అర్జున్,​ మెహర్​ నుంచి విడిపోయాక.. ఐపీఎల్ అనంతరం ఓ పార్టీలో గాబ్రియెల్లాను కలుసుకున్నాడు. వీరిద్దరి మధ్య 13 సంవత్సరాల వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ.. అవేవీ వారికి అడ్డు రాలేదు.

ABOUT THE AUTHOR

...view details