మాస్ డైలాగ్‌లు, అదిరిపోయే ఫైట్లతో ఎప్పుడు అభిమానులను అలరించే హీరో బాలకృష్ణ.. సెలబ్రిటీ టాక్ షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే'తో తనలోని కొత్త కోణాన్ని బయటకు తీసి ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నారు. కామెడీ చేస్తూ, పంచ్‌లు వేస్తూ వ్యాఖ్యాతగా అదరగొడుతున్నారు. తాజాగా ఈ కార్యక్రమంలో నేడు వాలంటైన్స్ డే సందర్భంగా అమ్మాయిలను ఎలా ఆకట్టుకోవాలో అనే విషయంపై కొన్ని టిప్స్ చెప్పారు బాలయ్య. అవేంటంటే..
- అన్‌స్టాపబుల్ 'పుష్ప' స్పెషల్ ఎపిసోడ్ చూడండి. అందులో చీఫ్ గెస్ట్‌గా రష్మిక రానుంది.
- అమ్మాయిలకు అర్ధంకాని భాషలో అందంగా పొగడండి.
- ఏం చేసినా ఇబ్బంది పెట్టకపోతే అమ్మాయిలే పడిపోతారు.
ఇలా ఈ మూడు టిప్స్ చెప్పారు బాలయ్య. దీనికి సంబంధించిన వీడియోను ఆహా ట్వీట్ చేసింది. ఇది ప్రస్తుతం నెెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఉపాసన టిప్స్
Ramcharan Upasana: "ప్రేమలో పడటం సులభమే కానీ దానిలో ఉండటం పార్క్‌లో సరదాగా నడిస్తూ కాలక్షేపం చేసినంత ఈజీ కాదు" అని అన్నారు మెగాహీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన. వాలంటైన్స్ డేను సందర్భంగా నెటిజన్లకు ఆమె ఈ విషయాన్ని చెప్పారు. చరణ్‌తో తన వివాహమై 10 సంవత్సరాలైందని.. తమ మధ్య అన్యోన్యతకు గల రహస్యాన్ని ఆమె వివరించారు. జీవితభాగస్వామి లేదా ప్రియమైన వారితో మన బంధం ఎప్పుడూ సంతోషంగా సాగాలంటే ఏం చేయాలో చెప్పారు.
"నేను చరణ్ పెళ్లి చేసుకుని పదేళ్లు అయ్యింది. వాలంటైన్స్ డే నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. ప్రియమైన వారితో మీ బంధం మరింత బలంగా మారేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి. వివాహ బంధంలో ఆరోగ్యానికి ముఖ్యస్థానం ఉంది. కాబట్టి మనం ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధపెట్టాలి. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేవాలి.
ప్రియమైన వారితో కొద్ది సమయాన్ని గడపటం రొటీన్‌గా మార్చుకోవాలి. ఏ కాస్త ఖాళీ దొరికినా డిన్నర్ డేట్, సినిమాలు చూడటం, కబుర్లు చెప్పుకోవడం.. ఇలా చేయడం వల్ల మీ జీవితం మరింత అందంగా మారుతుంది. ఒకవేళ మీరు కనుక ఇది ఫాలో కాకపోతే ఇప్పటికైనా దయచేసి మీ వారి కోసం సమయాన్ని కేటాయించడం తెలుసుకోండి.
ప్రతిఒక్కరూ పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారంటారు. కానీ, అది నిజం కాదు. భూమ్మీద ఇద్దరు వ్యక్తులు ఎంతో శ్రమిస్తేనే వివాహానికి పునాది పడుతుంది. వీటితోపాటు ఎదుటివ్యక్తిపై అమితమైన ప్రేమ, గౌరవం చూపించాలి" అని ఉపాసన చెప్పుకొచ్చారు.
కాగా, రామ్‌చరణ్ త్వరలోనే ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీంతో పాటే ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న 'ఆర్సీ 15'లో నటిస్తున్నారు.
ఇదీ చూడండి: ఆ కమెడియన్‌కు స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్!