క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ప్రేక్షకుల్లో ఆదరణ ఎక్కువ. కథ నచ్చాలే గాని అది చిన్న చిత్రమా, పెద్ద చిత్రమా అని చూడరు. ఇటీవలే 'దిశ' సంఘటన జరిగింది. ఈ పేరునే తమ హీరోయిన్‌కు పెట్టి తీస్తున్న సినిమా 'వలయం'. ట్రైలర్‌ను హీరో అడివి శేష్ ఈరోజు(ఆదివారం) విడుదల చేశాడు. ఆద్యంతం ఆసక్తిగా ఉంటూ అంచనాల్ని పెంచుతుంది.
కనిపించని 'దిశ'.. ఆమెకు ఏమైంది? - actress digangana
సస్పెన్స్ కథతో తెరకెక్కుతున్న 'వలయం' ట్రైలర్ ఆసక్తి రేపుతోంది. ఈ నెల 21న రానుందీ చిత్రం. ప్రధాన పాత్రల్లో లక్ష్, దిగంగన నటిస్తున్నారు.
వలయం సినిమా ట్రైలర్
ఈ చిత్రంతో లక్ష్ చదవలవాడ హీరోగా పరిచయమవుతున్నాడు. దిగంగన సూర్యవంశీ హీరోయిన్గా నటిస్తోంది. రమేశ్ కడుముల దర్శకత్వం వహిస్తున్నాడు. శేఖర్ చంద్ర సంగీతమందించాడు. పద్మావతి చదవలవాడ నిర్మించారు. ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
Last Updated : Feb 29, 2020, 6:55 PM IST