మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోగా నటించిన చిత్రం వాల్మీకి. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో తమిళ నటుడు అధర్వ కీలక పాత్రలో కనిపించనున్నాడు. హరీశ్ శంకర్ దర్శకుడు. ఈ నెల 20న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా విక్టరీ వెంకటేశ్ హాజరయ్యాడు.
"ఎఫ్2 తర్వాత వరుణ్ ఈ సినిమాలో లుక్ మొత్తం మార్చేశాడు. గద్దలకొండ గణేశ్‌గా రచ్చ రచ్చ చేశాడు. వాల్మీకి రామాయణం రాశాడు. మరి ఈ వాల్మీకి ఏం రాశాడో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. నా మిత్రుడు పవన్‌కల్యాణ్‌కు గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బ్లాస్టర్ హిట్ ఇచ్చాడు హరీశ్ శంకర్. వరుణ్‌కు కూడా మంచి హిట్ ఇస్తాడని నమ్మకం ఉంది" -వెంకటేశ్
మాస్ సినిమాలో ఉన్న కిక్కే వేరు అంటూ పవన్ కల్యాణ్ డైలాగ్ చెప్పాడు వరుణ్ తేజ్.