'వకీల్ సాబ్' సినిమాతో పవర్‌స్టార్ రీఎంట్రీ ఇస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను సోమవారం విడుదల చేసింది చిత్రబృందం. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఓ సాధారణ వ్యక్తిగా నల్ల కళ్లద్దాలు పెట్టుకుని, పుస్తకం పట్టుకుని ప్రశాంతంగా కూర్చున్న ఫోటోనే సంచలనం సృష్టించింది. సినిమాల్లో గ్యాప్ వచ్చినా అతడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఇది నిరూపించింది. ట్విట్టర్‌లో అత్యధికంగా చర్చించిన చిత్రంగా ట్రెండింగ్‌లో నిలిచింది.
క్రేజ్ కా బాప్.. ట్విట్టర్‌లో 'వకీల్ సాబ్' రికార్డు జోరు
"అద్భుతం జరిగేటపుడు ఎవరూ గుర్తించలేరు. జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. స్వామి ఇది నీ దర్శనం. ఇది నిదర్శనం." ఈ డైలాగ్ ఖలేజా సినిమాలోనిది. ఈ డైలాగ్ ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర కథానాయకుడు పవన్ కల్యాణ్‌కు అన్వయించుకోవచ్చు. 'వకీల్‌సాబ్' సినిమా ఫస్ట్‌లుక్ అందుకు నిదర్శనంగా నిలిచింది.
ఇప్పటివరకు ఏ చిత్రానికి ఇలాంటి ఘనత దక్కలేదు. దేశవ్యాప్తంగా.. విడుదలైన 24 గంటల్లో అత్యధికంగా రీట్వీట్లు (25.3కే) చేసిన తొలి తెలుగు సినిమా ఫస్ట్‌లుక్‌గా.. అత్యధికంగా (3.5మిలియన్) టైటిల్ ట్యాగ్ ట్వీట్ చేసిన చిత్రంగా 'వకీల్ సాబ్' రికార్డు సృష్టించింది. హిందీలో విజయవంతమైన 'పింక్' చిత్రానికి రీమేక్ ఇది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. బోనీ కపూర్ సమర్పకుడు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలోని తొలిపాటను విడుదలచేయున్నారని ప్రచారం జరుగుతోంది.
ఇదీ చూడండి.. చందమామే పక్కనుంటే అది షాలినీలానే ఉంటుంది!