తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మగువా మగువా' ఫిమేల్​ వెర్షన్ వచ్చేసింది​ - maguva maguva female version song

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ నటించిన 'వకీల్​సాబ్'​ సినిమాలోని 'మగువా మగువా' పాట ఫిమేల్​ వెర్షన్​ను విడుదల చేసింది చిత్రబృందం. దీన్ని మీరూ వినేయండి..

vakeelsaab
వకీల్​సాబ్​

By

Published : Apr 15, 2021, 6:55 PM IST

దాదాపు మూడేళ్ల తర్వాత 'వకీల్​సాబ్'​ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు పవర్​స్టార్​ పవన్​కల్యాణ్. ఏప్రిల్​ 9న విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు. శ్రుతిహాసన్‌ కథానాయిక. నివేదా థామస్‌, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రల్లో నటించారు.

సినిమా అద్భుతంగా ఉందంటూ ఇప్పటికే అభిమానుల నుంచి పలువురు సినీ ప్రముఖులు వరకు సామాజిక మాధ్యమాల వేదికగా చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ముఖ్యంగా పాటలు శ్రోతలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇందులోని 'మగువా మగువా' సాంగ్ శ్రోతల్ని ఎంతగానో అలరించింది. ఈ క్రమంలోనే ఈ పాట ఫిమేల్​ వెర్షన్​ను విడుదల చేసింది చిత్రబృందం. దీన్ని మీరు వినేయండి..

ABOUT THE AUTHOR

...view details