పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'వకీల్‌సాబ్'. బాలీవుడ్ చిత్రం 'పింక్'కు రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలోని తన పాత్ర షూటింగ్‌ను ఇటీవలే పూర్తి చేశారు పవన్. తాజాగా ఈ సినిమా టీజర్ తేదీని వెల్లడించింది చిత్రబృందం. సంక్రాంతి కానుకగా జనవరి 14న సాయంత్ర 6.03 గంటలకు టీజర్‌ను విడుదల చేస్తామని ప్రకటించింది.
వకీల్‌సాబ్, లవ్‌స్టోరి టీజర్ డేట్ ఫిక్స్ - Vakeelsaab teaser on sankranthi
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్‌సాబ్' టీజర్ డేట్ ఫిక్సయింది. అలాగే నాగ చైతన్య, సాయిపల్లవిల 'లవ్‌స్టోరి' టీజర్ విడుదల తేదీ ప్రకటించింది చిత్రబృందం.
వకీల్‌సాబ్, లవ్‌స్టోరీ టీజర్
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం 'లవ్‌స్టోరి'. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ ప్రేమకథా చిత్ర టీజర్ తేదీని తాజాగా వెల్లడించింది చిత్రబృందం. జనవరి 10న 10.08 గంటలకు ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించింది.
Last Updated : Jan 7, 2021, 7:48 PM IST