ఈసారి సంక్రాంతి సీజన్లో సినిమాల పోటీ ఎక్కువగానే ఉండనుంది. కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూతపడి 5 నెలలు అవుతోంది. పూర్తి స్థాయిలో మళ్లీ థియేటర్లు సంక్రాంతి వరకే అందుబాటులోకి వస్తాయని అందరూ భావిస్తున్నారు. దీంతో ఈ పండగకు తమ చిత్రాలు విడుదల చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు నిర్మాతలు. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం రెండు పెద్ద చిత్రాలు సంక్రాంతి వార్‌కు సిద్ధమవుతున్నాయట.
కొంత విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'వకీల్‌సాబ్'. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. కొద్ది భాగమే చిత్రీకరణ మిగిలి ఉంది. దీన్ని త్వరలోనే పూర్తి చేసి సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని భావిస్తోందట చిత్రబృందం.