పవన్ కల్యాణ్ కథానాయకుడిగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'వకీల్‌సాబ్'. దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. శ్రుతిహాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ముఖ్య పాత్రలు పోషించారు. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే నిర్మాణాంతర పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ తేదీని వెల్లడించగా.. ఇప్పుడు ఆ రిలీజ్ టైమ్‌ను ప్రకటించారు.
'వకీల్‌సాబ్' ట్రైలర్ అప్డేట్.. రికార్డుల మోతే ఇక? - వకీల్‌సాబ్ ట్రైలర్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్‌సాబ్' ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. మార్చి 29న సాయంత్రం 6 గంటలకు ఈ ప్రచార చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాణసంస్థ వెల్లడించింది.
వకీల్‌సాబ్
ఈనెల 29న సాయంత్రం 6గంటలకు ట్రైలర్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇటీవలే తన పాత్ర కోసం డబ్బింగ్ చెప్పడం ప్రారంభించిన పవన్.. శనివారంతో ఆ పని పూర్తి చేశారు. బాలీవుడ్‌లో విజయవంతమైన 'పింక్'కి రీమేక్‌గా రూపొందుతోన్న చిత్రమిది. పవన్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని కథలో చాలా మార్పులు చేశారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.
ఇదీ చూడండి:ఫిల్మ్‌ఫేర్ 2021: ఉత్తమ నటీనటులుగా ఇర్ఫాన్, తాప్సీ
Last Updated : Mar 28, 2021, 1:40 PM IST