పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని శనివారం ప్రకటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈనెల 14న సంక్రాంతి కానుకగా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. దీంతో అభిమానుల టీజర్ రాక కోసం ఎదురుచూస్తున్నారు.
'వకీల్‌సాబ్' షూటింగ్ పూర్తి.. టీజర్‌పై అప్పుడే ఆసక్తి - వకీల్‌సాబ్ న్యూస్
పవన్ న్యాయవాది లుక్‌లో కనిపించనున్న 'వకీల్‌సాబ్' షూటింగ్ పూర్తయింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.

'వకీల్‌సాబ్' షూటింగ్ పూర్తి.. టీజర్‌పై అప్పుడే ఆసక్తి
ఇటీవల పవన్, తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేశారు. అప్పుడు క్లైమాక్స్ ఫైట్ ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ చిత్రంలో శ్రుతిహాసన్, అంజలి, నివేధా థామస్ ప్రధాన పాత్రలు పోషించారు. దిల్‌రాజు నిర్మాత. వేణు శ్రీరామ్ దర్శకుడు. వేసవి కానుకగా ఏప్రిల్‌లో థియేటర్లలో సినిమా విడుదలయ్యే అవకాశముంది.
ఇది చదవండి:'వకీల్‌సాబ్' క్లైమాక్స్ ఫైట్ ఫొటోలు లీక్!