తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Vakeelsaab-krack: టాప్-10లో 'వకీల్​సాబ్', 'క్రాక్' - విజయ్ మాస్టర్ ఐఎమ్​డీబీ

పవన్​ కల్యాణ్ 'వకీల్​సాబ్', రవితేజ 'క్రాక్' సినిమాలు రికార్డు సాధించాయి. ఐఎమ్​డీబీ విడుదల చేసిన ఇండియా మూవీస్/వెబ్ సిరీస్​ టాప్-10లో స్థానం దక్కించుకున్నాయి.

IMDb's top 10 Indian movies
వకీల్​సాబ్ క్రాక్ మూవీస్

By

Published : Jun 13, 2021, 12:20 PM IST

అంతర్జాతీయ ప్రముఖ రివ్యూ సంస్థ ఐఎమ్​డీబీ.. టాప్-10 ఇండియన్​ మూవీస్​ జాబితాను తాజాగా విడుదల చేసింది. ఇందులో దక్షిణాది సినిమాలు జోరు చూపించాయి. పవన్​ 'వకీల్​సాబ్', రవితేజ 'క్రాక్​'.. ఇందులో చోటు దక్కించుకుని ఘనత సాధించాయి.

2021 సగం అప్పుడే గడిచిపోయింది. లాక్​డౌన్ వల్ల సినిమాలు కొన్ని థియేటర్లతో పాటు ఓటీటీల్లోనూ ప్రేక్షకాదరణ పొందాయి. పలు వెబ్​సిరీస్​లనూ ప్రజలు ఆదరించారు. వీటన్నింటిలో ప్రజలకు బాగా నచ్చిన వాటితో టాప్-10 జాబితాను ఐఎమ్​డీబీ ప్రకటించింది.

ఇందులో విజయ్ 'మాస్టర్' అగ్రస్థానంలో నిలిచింది. 'ఆస్ప్రింట్స్' వెబ్ సిరీస్, ప్రియాంక చోప్రా 'వైట్ టైగర్', మోహన్​లాల్ 'దృశ్యం 2', తమన్నా 'నవంబరు స్టోరీ' సిరీస్, ధనుష్ 'కర్ణన్', పవన్ 'వకీల్​సాబ్', హ్యుమా ఖురేషి 'మహారాణి' పొలిటికల్ డ్రామా సిరీస్, రవితేజ 'క్రాక్', మలయాళ హిట్ 'ద గ్రేట్ ఇండియా కిచెన్' సినిమా వరుస స్థానాల్లో నిలిచాయని ఐఎమ్​డీబీ వెల్లడించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details