పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ రీఎంట్రీలో లాయర్‌గా నటిస్తున్న సినిమా 'వకీల్‌సాబ్'. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇందులోని తొలి లిరికల్ పాటను విడుదల చేశారు. 'మగువ మగువ లోకానికి తెలుసా నీ విలువ' అంటూ సాగుతున్న లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. బాలీవుడ్ హిట్ 'పింక్' రీమేక్‌గా ఈ చిత్రాన్ని తీస్తున్నారు.
పవర్‌స్టార్ 'వకీల్‌సాబ్' తొలి లిరికల్ వచ్చేసింది - MAGUVA MAGUVA SONG
పవన్‌కల్యాణ్ 'వకీల్‌సాబ్' సినిమా తొలి లిరికల్ గీతం.. ఉమెన్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చేసింది.
వకీల్‌సాబ్ తొలిపాట
ఈ గీతానికి తమన్ సంగీతమందించగా, సిద్ శ్రీరామ్ పాడాడు. 'వకీల్‌సాబ్'కు వేణు శ్రీరామ్ దర్శకుడు. బోనీకపూర్ సమర్పణలో దిల్‌రాజు.. బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. రానున్న వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.