తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వైష్ణవ్​తేజ్ బటర్​ఫ్లై కిస్.. నాని కొత్త సినిమా షూటింగ్ పూర్తి - DJ Tillu anirudh song

కొత్త సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో అంటే సుందరానికీ, రంగరంగ వైభవంగా, డీజే టిల్లు, గెహ్రాహియా చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

movie news
మూవీ న్యూస్

By

Published : Jan 24, 2022, 11:19 AM IST

Nani ante sundaraniki movie: 'శ్యామ్​సింగరాయ్'తో హిట్​ కొట్టిన నేచురల్​ స్టార్ నాని.. మరో సినిమాతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు. హాస్యభరిత చిత్రం 'అంటే సుందరానికీ' షూటింగ్​ను ఆదివారంతో పూర్తి చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా వెల్లడిస్తూ, ఓ వీడియో పోస్ట్ చేశారు.

ఇందులో నాని సరసన నజ్రియా హీరోయిన్​గా నటించింది. ఈమెకు తెలుగులో ఇదే తొలి సినిమా. 'బ్రోచేవారెవరురా!' ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.

మెగాహీరో వైష్ణవ్​తేజ్ కొత్త సినిమాకు 'రంగరంగ వైభవంగా' టైటిల్ ఖరారు చేశారు. కేతిక శర్మ హీరోయిన్​గా చేస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తుండగా, గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్నారు.

'నీకు బటర్​ఫ్లై కిస్ తెలుసా?' అని హీరోయిన్, హీరోను అడిగి అతడికి ముద్దు పెడుతుంది. 'ఎలా ఉంది?' అని మళ్లీ ఆమె అడగ్గా.. నెక్స్ట్​ లెవల్​లో ఉంది వైష్ణవ్​తేజ్ చెబుతున్న డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాను రొమాంటిక్ ఎంటర్​టైనర్​గా తీస్తున్నట్లు తెలుస్తోంది.

DJ Tillu movie: 'డీజే టిల్లు' నుంచి మరోసాంగ్ వచ్చేసింది. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్.. ఈ పాటను ఆలపించారు. 'పటాస్ పిల్లా' అనే లిరిక్స్​తో ఉన్న ఈ గీతం.. ఆద్యంతం అభిమానుల్ని అలరిస్తుంది.

మాస్ మసాలా ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతికే రావాల్సి ఉన్నప్పటికీ, ఒమిక్రాన్ కారణంగా వాయిదాపడింది. ఇందులో సిద్ధు, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు.

Gehraiyaan song: 'గెహ్రాహియా' సినిమాలోని మరో మెలోడి గీతం రిలీజైంది. 'డూబే' అనే వీడియో గీతం.. సోమవారం విడుదలైంది. ఇందులో సిద్ధాంత్-దీపికల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం సమాజంలో ఉన్న రిలేషన్స్​ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఫిబ్రవరి 11న ఓటీటీలో రిలీజ్ కానుంది. షకున్ బత్రా దర్శకత్వం వహించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details