వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన 'ఉప్పెన'.. ప్రేక్షకుల నుంచి విశేషాదరణ సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం.. కలెక్షన్లు కొల్లగొడుతూ బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించింది. రెండు వారాలు పూర్తయిన సందర్భంగా సినిమా మేకింగ్ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.
'ఉప్పెన' మేకింగ్.. అభిమానులు ఫుల్ ఖుష్ - movie latest news
థియేటర్లలో సందడి చేస్తున్న 'ఉప్పెన' మేకింగ్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. హీరోహీరోయిన్లు వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టితో పాటు దర్శకుడు బుచ్చిబాబుకు ఇదే తొలి సినిమా కావడం విశేషం.
'ఉప్పెన' మేకింగ్.. అభిమానులు ఫుల్ ఖుష్
ఇందులో వైష్ణవ్, కృతితో పాటు విజయ్ సేతుపతి పోషించిన పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రంతో పరిచయమైన బుచ్చిబాబు, దర్శకుడిగా మెప్పించారు. నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ దీనితో మరో విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇవీ చదవండి: