తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కృతికి ఎన్ని టాటూలు ఉన్నాయి?.. వైష్ణవ్​ ఫన్నీ ఆన్సర్! - uppena krithi shetty

'నెం.1 యారి రానా' టాక్​షోలో వైష్ణవ్​తేజ్-కృతిశెట్టి అల్లరిచేశారు. హోస్ట్ రానా అడిగిన ప్రశ్నలకు క్రేజీ సమాధానలిచ్చారు. అందుకు సంబంధించిన ప్రోమో శుక్రవారం విడుదలై, నెటిజన్లను అలరిస్తోంది.

KRITHI SHETTY ON 'NO.1 YAARI RANA' SHOW
కృతిశెట్టి వైష్ణవ్ తేజ్

By

Published : May 7, 2021, 5:21 PM IST

'ఉప్పెన' సినిమాతో ఆకట్టుకున్న మెగాహీరో వైష్ణవ్​తేజ్-కృతిశెట్టి.. ఇప్పుడు నెటిజన్లను మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యారు. రానా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న 'నెం.1 యారి' టాక్​షోలో పాల్గొని సందడి చేశారు. పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

హీరోయిన్ కృతిశెట్టి

13 ఏళ్లకే నటించడం మొదలుపెట్టానని కృతిశెట్టి.. రానా ప్రశ్నకు బదులిచ్చింది. వైష్ణవ్​ ఊతపదం ఏంటి? అని అడగ్గా.. నో నో ప్లీజ్​ అంటూ ఆమె చెప్పింది. కృతికి ఎన్ని టాటూలు ఉన్నాయి? అని రానా అడగ్గా.. వైష్ణవ్ నవ్వుతూ సమాధానమిచ్చాడు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ గణితసూత్రం అడగ్గా, కృతి చెప్పలేక తలపట్టుకుంది. ఈ ఎపిసోడ్​ మే 9న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ఇది చదవండి:నా నటన చూసి ఏడ్చేశారు: కృతిశెట్టి

ABOUT THE AUTHOR

...view details