తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'కల్పనా చావ్లా బయోపిక్​లో నటించాలనుంది' - కల్పనా చావ్లా బయోపిక్​లో వాణీ కపూర్

వ్యోమగామి కల్పనా చావ్లా బయోపిక్​లో నటించాలని ఆశపడుతోంది బాలీవుడ్​ భామ వాణీ కపూర్​. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన కల్పనా జీవితం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అంటోంది. ప్రస్తుతం అక్షయ్​ కుమార్​ సరసన 'బెల్​ బాటమ్' చిత్రంలో నటిస్తోంది వాణి.

vaani kapoor said if i play in kalpana chawla biopic its be honour
'ఆ రోల్​మోడల్​ బయోపిక్​లో నటించాలనుంది'

By

Published : Aug 7, 2020, 9:31 AM IST

నటీనటులకు కెరీర్‌ పరంగా వారికంటూ కొన్ని ఆశలుంటాయి. పౌరాణిక పాత్ర చేయాలి.. విలన్‌ ఛాయలున్న పాత్రలు చేయాలి.. బయోపిక్స్‌లో నటించాలని కోరుకుంటారు. అలాగే బాలీవుడ్‌ నటి వాణీ కపూర్‌కి కూడా ఒకరి బయోపిక్‌లో నటించాలనే కోరిక ఉందట.

తొలి సినిమా 'శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌'తో వాణీ కపూర్‌ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకుంది. బాలీవుడ్‌లో మూడు, కోలీవుడ్‌లో ఒకటి మొత్తం కలిపి చేసింది నాలుగు సినిమాలే.. అయినా సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు చిత్రాలున్నాయి. అయితే దివంగత వ్యోమగామి కల్పనా చావ్లా బయోపిక్‌లో నటించాలని ఉందంటూ తాజాగా ఆమె తన కోరికను బయటపెట్టింది.

ఆమె ఓ రోల్​మోడల్​

"ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకు, వ్యోమగామి కావాలనుకునే వారికి కల్పనా చావ్లా ఒక రోల్‌ మోడల్‌. ఆమె ఒక స్ఫూర్తిమంతమైన మహిళ. ఆమె జీవితాన్ని కచ్చితంగా చెప్పుకొవాల్సిన అవసరముంది. అందుకే వెండితెరపై ఆమె బయోపిక్‌లో నటించాలని చాలా ఆశపడుతున్నా. ఆమె బయోపిక్‌లో నటించగలిగితే నేను దానిని గౌరవంగా భావిస్తా" అని వాణీ కపూర్‌ చెప్పుకొచ్చింది.

ఆయుష్మాన్​తో కొత్త చిత్రం

ప్రస్తుతం అక్షయ్​ కుమార్​ సరసన 'బెల్​ బాటమ్' చిత్రంలో నటిస్తున్న వాణీ కపూర్​కు తాజాగా మరో అవకాశం వచ్చింది. బాలీవుడ్​ విలక్షణ నటుడు ఆయుష్మాన్​ ఖురానా హీరోగా అభిషేక్​ కపూర్​ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ప్రేమ కథాచిత్రంలో.. హీరోయిన్​గా ఎంపికైంది వాణి. దీనిపై స్పందించిన ఈ బాలీవుడ్​ భామ.. ఆయుష్మాన్​తో కలిసి తెర పంచుకోవడం చాలా ఆనందంగా ఉందంటూ వెల్లడించింది. అక్టోబరులో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని సమాచారం.

ABOUT THE AUTHOR

...view details