*సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా 'వడివాసల్'. 'అసురన్' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత డైరెక్టర్ వెట్రిమారన్ తీస్తున్న ప్రాజెక్టు ఇది. ఇప్పటికే టైటిల్ వెల్లడించినప్పటికీ, అందుకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం(జులై 16) సాయంత్రం 5:30 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
*మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి హీరోగా నటిస్తున్న చిత్రం 'బ్రో డాడీ'. మరో కథానాయకుడు పృథ్వీరాజ్ దర్శకత్వం వహించడం సహా ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో గురువారం(జులై 15) ప్రారంభమైంది. కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంతకుముందు మోహన్‌లాల్-పృథ్వీరాజ్ కాంబినేషన్లో వచ్చిన 'లూసిఫర్' ప్రేక్షకుల్ని అలరించింది.