తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఉగాదికి వైలెన్స్​తో వస్తున్నా: నాని - nani, sudeer babu

నాని, సుధీర్ బాబు కలయికలో మల్టీస్టారర్​గా రూపొందుతున్న చిత్రం 'వి'. ఈ సినిమా రిలీజ్​ డేట్​తో కూడిన పోస్టర్​ను అభిమానులతో పంచుకుంది చిత్రబృందం.

వి

By

Published : Nov 4, 2019, 11:27 AM IST

ఉగాది పండక్కి హింసను చూపిస్తానంటున్నాడు టాలీవుడ్‌ నేచురల్‌ స్టార్‌ నాని. సుధీర్‌బాబు, నాని కలిసి నటిస్తున్న చిత్రం 'వి'. మోహన్‌ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నాడు. నివేదా థామస్‌, ఆదితిరావు హైదరీ కథానాయికలు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఉగాదికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. రిలీజ్​ డేట్​తో కూడిన ఓ స్పెషల్‌ పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది.

పోస్టర్​ ఆసక్తికరంగా ఉంది. "ఈ క్షణం నుంచి నా శత్రువులకి నా దయా దాక్షిణ్యాలే దిక్కు - విలియమ్ షేక్స్‌పియర్‌." అనే లైన్ స్టోరీ ప్లాట్​ను తెలుపుతుంది.

వి

ఈ పోస్టర్‌పై స్పందించిన నాని "వైలెన్స్‌ కావాలన్నారుగా.. ఇస్తా..! ఉగాదికి సాలిడ్‌గా ఇస్తా.." అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చి 25నే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చూడండి.. 'అల వైకుంఠపురములో'ని టబు లుక్​ ఇదిగో..

ABOUT THE AUTHOR

...view details