తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వర్మ చిత్రం రాజ్ ​తరుణ్​తోనా? వరుణ్​ తేజ్​తోనా? - ఉయ్యాలా జంపాలా సినిమా దర్శకుడు

'ఉయ్యాలా జంపాలా' సినిమా దర్శకుడు విరించి వర్మ.. మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. మెగాహీరో వరుణ్​ తేజ్​తో చర్చలు జరిపినట్లు సమాచారం. ఇదే కథకు రాజ్​ తరుణ్​ పేరు వినిపిస్తోంది. మరి ఈ చిత్రంలో ఎవరు నటిస్తారో చూడాలి.

వర్మ చిత్రం 'రాజ్ ​తరుణ్​తోనా? వరుణ్​ తేజ్​తోనా?'

By

Published : Nov 25, 2019, 4:52 PM IST

యువహీరో రాజ్‌ తరుణ్‌తో 'ఉయ్యాలా జంపాలా' తెరకెక్కించిన దర్శకుడు విరించి వర్మ. తొలి చిత్రంతోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. నాని హీరోగా 'మజ్ను' టైటిల్​తో రెండో సినిమా తీశాడు. ఇలా రెండు ప్రేమకథల్ని రూపొందించిన వర్మ.. మూడో ప్రాజెక్టు విషయమై ఆచితూచి అడుగు లేస్తున్నాడు.

'మజ్ను' తర్వాత విరామం తీసుకున్న వర్మ.. కల్యాణ్‌ రామ్‌తో ఓ చిత్రం చేస్తున్నాడంటూ వార్తలొచ్చాయి. కల్యాణ్‌ రామ్‌కు ఓ కథ వినిపించాడని సినీ వర్గాల్లో టాక్​. అయితే, వర్మ చెప్పిన స్టోరీ నచ్చినా.. ఇప్పటికే కొన్ని చిత్రాలకు డేట్స్​ ఇవ్వడం వల్ల, కల్యాణ్​రామ్ తర్వాత చేస్తానన్నాడని సమాచారం.

ఇదే గ్యాప్​లో మరో చిత్రం తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట వర్మ. మెగాహీరో వరుణ్‌ తేజ్‌తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రాజ్‌ తరుణ్‌ పేరు కూడా వినిపిస్తోంది. వరుణ్‌ ఈ ప్రాజెక్టుకు ఒప్పుకోకపోతే తరుణ్‌తో తీద్దామనుకుంటున్నాడు వర్మ. మరి ఇద్దరిలో ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేదెవరో చూడాలి.

ఇవి కూడా చదవండి:చెర్రీ తొలి సినిమా రాజమౌళి అందుకే చేయనన్నాడు..!

ABOUT THE AUTHOR

...view details