తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రెబల్​స్టార్​ సినిమాకు 25 రకాల సెట్టింగ్​లు..! - పూజా హెగ్డే

యంగ్​రెబల్​ స్టార్​ ప్రభాస్​ తదుపరి చిత్రం కోసం 25 రకాల సెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. షూటింగ్​కు సంబంధించిన వివరాలు, ఫొటోలు బయటకు రాకుండా జాగ్రత్త వహిస్తోంది చిత్రబృందం. తొలి షెడ్యూల్​ హైదారాబాద్​లో, ఆ తర్వాత యూరప్​లో చిత్రీకరణ జరగనున్నట్లు తెలుస్తోంది.

uv creations production planning 25 settings for prabhas new movie
రెబల్​స్టార్​ సినిమాకు 25 రకాల సెట్టింగ్​లు..!

By

Published : Jan 25, 2020, 5:10 PM IST

Updated : Feb 18, 2020, 9:22 AM IST

'ప్రభాస్‌ 20' చిత్ర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్​లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుండగానే తర్వాతి షెడ్యూల్​కు సంబంధించిన సెట్టింగ్​ పనులు చకచకా జరిగిపోతున్నాయి. యూరోప్‌ నేపథ్యంతో సాగే ఓ సరికొత్త పీరియాడిక్​ ప్రేమ కథా చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నారు. అందుకు తగ్గట్లుగా '70ల కాలంలోని యూరోపియన్‌ నగర వాతావరణానికి తగ్గట్లుగా సినిమా కోసం కీలక సెట్లను రూపొందిస్తోంది చిత్ర బృందం. ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియోస్‌తో పాటు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో దాదాపు 25 రకాల సెట్లను నిర్మిస్తున్నారని సమాచారం. ఇప్పటికే వీటిలో కొన్ని పూర్తికాగా.. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన అత్యధిక చిత్రీకరణ ఈ సెట్లలోనే జరగనుంది.

'ప్రభాస్20' సినిమా ఫస్టలుక్​

అంతేకాదు వీటికి సంబంధించిన వివరాలు, ఫొటోలు బయటకు రాకుండా చిత్ర బృందం అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సెట్​లో సెల్​ఫోన్లు అనుమతించకుండా ఏర్పాట్లు చేశారు. షూటింగ్​లో అతిథులు వచ్చినా వారిని కూడా బయటే కలుసుకునే విధంగా నటీనటుల కోసం ఏర్పాట్లు చేశారని సినీవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం కావడం వల్ల ఏ చిన్న పొరపాటు జరగకూడదని పట్టుదలతో ఉందట చిత్ర బృందం. వచ్చే ఏడాది వేసవి కానుకగా చిత్రం విడుదలకానుంది. 'జిల్‌' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికీ ఈ చిత్రానికి టైటిల్​ ఖరారు చేయలేదు.

ఇదీ చూడండి.. ప్రభాస్​కు​ తల్లిగా అలనాటి అందాల భామ.!

Last Updated : Feb 18, 2020, 9:22 AM IST

ABOUT THE AUTHOR

...view details