తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆడేద్దాం.. 'సాహో' వీడియో గేమ్ - uv creations

విడుదలకు సిద్ధమవుతోన్న 'సాహో'.. త్వరలో వీడియో గేమ్​గా నెటిజన్ల ముందుకు రానుంది. ఈ విషయాన్ని  చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వెల్లడించింది.

త్వరలో సాహో వీడియో గేమ్

By

Published : Jul 31, 2019, 4:43 PM IST

ప్రభాస్​ హీరోగా నటించిన భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 'సాహో'. శ్రద్ధా కపూర్ హీరోయిన్​గా కనిపించనుంది. వీరితో పాటు ప్రముఖ తారాగణం ఇందులో ఉంది. ఇంతటి హైప్​ క్రియేట్​ చేస్తోన్న ఈ సినిమా త్వరలో వీడియో గేమ్​ రూపంలో నెటిజన్లకు కనువిందు చేయనుంది. నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్​ సామాజిక మాధ్యమాల్లో ఈ విషయాన్ని పంచుకుంటూ ఓ ఫొటోను విడుదల చేసింది.

సాహో వీడియో గేమ్​ గురించి యూవీ క్రియేషన్స్ పోస్ట్

'సాహో' చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే వచ్చిన టీజర్​ నెటిజన్లను ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాల్ని పెంచింది. సుమారు రూ.300 కోట్ల బడ్జెట్​తో నిర్మించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 30న విడుదల కానుంది.

ఇది చదవండి: 'సాహో' మ్యూజిక్ కంపోజర్​పై దాడి

ABOUT THE AUTHOR

...view details