థియేటర్లు బ్లాక్ చేసి పెట్టడం వల్ల తమ సినిమాకు అన్యాయం జరిగిందని 'ఉత్తర' నటీనటులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేక్షకుల నుంచి తమ చిత్రానికి మంచి స్పందన లభిస్తున్నప్పటికీ పరిశ్రమ పెద్దల సహకారం లేకపోవడం వల్ల, ఆశించిన థియేటర్లు దొరకలేదని అన్నారు.
'విడుదల రోజున థియేటర్లు దొరకలేదు' - uthara movie
శ్రీరామ్, కారుణ్య జంటగా నటించిన చిత్రం 'ఉత్తర'. ఈనెల 3న విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ నిర్వహించిన చిత్రబృందం.. సరైన సంఖ్యలో థియేటర్లు దొరకకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసింది.

ఉత్తర చిత్రబృందం
ఉత్తర చిత్రబృందం
తిరుపతి ఎస్.ఆర్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో శ్రీరామ్, కారుణ్య జంటగా నటించిన చిత్రం 'ఉత్తర'. ఈ నెల 3న ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలకు ముందు పెద్ద సంఖ్యలో థియేటర్లు కేటాయిస్తున్నట్లు హామీ ఇచ్చారని, అయితే రిలీజ్ రోజు థియేటర్లు దొరకలేదని చిత్రబృందం వాపోయింది. పరిశ్రమ పెద్దలు తమ చిత్రాన్ని చూసి మంచి సినిమాలను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేసింది. 'ఉత్తర'ను ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పింది.
ఇవీ చూడండి.. బన్నీతో నిజమే.. క్లారిటీ ఇచ్చిన మురగదాస్