కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా కుదేలైన రంగాల్లో సినీరంగం ఒకటి. లాక్‌డౌన్‌తో థియేటర్లన్నీ మూసుకుపోయి.. షూటింగ్‌లు, సినిమా విడుదలలు వాయిదాపడ్డాయి. థియేటర్లలో విడుదలవ్వాల్సిన సినిమాలను వేరే దారి లేక కొంతమంది దర్శకనిర్మాతలు ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేసుకుంటున్నారు. అయితే ఈ ఓటీటీ వైపు కేవలం చిన్న సినిమాలు మాత్రమే మొగ్గు చూపాయి. ఎందుకంటే ఇదే ఫార్ములా బడా బడ్జెట్ చిత్రాలు అనుకరిస్తే.. నిర్మాతలు నష్టపోవాల్సి వస్తుంది. హాలీవుడ్ చిత్రాలైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాటికి వాటిల్లే నష్టం ఊహకు కూడా అందనిది. ఈ నేపథ్యంలో థియేటర్లు పునఃప్రారంభమయ్యాకే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఏఏ హాలీవుడ్ సినిమాల విడుదల తేదీలు వాయిదా పడ్డాయో తెలుసుకుందాం.
'టెనెట్'
హాలీవుడ్లో ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా 'టెనెట్'. ఈ చిత్రానికి క్రిస్టోఫర్ నోలన్ దర్శకుడు. జులై 17న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా జులై 31కి వాయిదా పడింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ తెలిపింది. టైమ్ ఇన్వర్షన్ అనే వినూత్న కథాంశంతో ఈ సినిమాను తీశారు. ఇందులో జాన్ డేవిడ్ వాషింగ్టన్, రాబర్ట్ పాటిన్సన్, డింపుల్ కపాడియా, మైకేల్ కెయిన్, ఎలిజిబెత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్.. సినిమాపై అంచనాల్ని పెంచింది.
'వండర్ ఉమెన్ 1984'
హాలీవుడ్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన మరో సినిమా 'వండర్ ఉమెన్ 1984'. హాలీవుడ్ నటి గాల్ గాడోట్ కథానాయిక. ప్యాటీ జెంకిన్స్ దర్శకత్వం వహించిన.. ఈ సినిమా ఆగస్టు 14 నుంచి అక్టోబర్ 2కు వాయిదా పడింది.
మ్యాట్రిక్స్ 4
కియాను రీవ్స్ నటించిన సైన్స్‌ఫిక్షన్ సినిమా 'మ్యాట్రిక్స్ 4'. తొలుత 2021 మే 21న విడుదల కావాల్సి ఉండగా ప్రస్తుతం 2022 ఏప్రిల్ 1కు వాయిదా పడింది. లానా వచోస్కి దర్శకత్వం వహించారు.