Urvashi rautela gold dress: తన వ్యాఖ్యలతో పలుమార్లు వివాదాల్లో నిలిచిన బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉండే ఈ భామ.. ఎప్పటికప్పుడు తన ఫొటోలు, వీడియోలతో నెటిజన్లను అలరిస్తూ ఉంటుంది. ఇప్పుడు బాగా ఖరీదైన డ్రస్‌లో కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసింది.
ఆ డ్రస్ సంగతేంటి?
అరబ్ ఫ్యాషన్ వీక్‌లో ఇప్పటికే పాల్గొన్న ఊర్వశి రౌతేలా.. మన దేశం నుంచి అందులో పార్టిసిపేట్ చేసిన ఏకైక సెలబ్రిటీగా నిలిచింది. ఇప్పుడు మరోసారి ఆ ఈవెంట్లో ర్యాంప్‌వాక్ చేసి రికార్డు సృష్టించింది! శనివారం జరిగిన ఈ ఈవెంట్లో ధగధగ మెరిసే బంగారు రంగు డ్రస్‌లో మైమరపించింది. అయితే ఈ ఔట్ఫిట్ ఖరీదు దాదాపు రూ.40 కోట్లు విలువ చేస్తుందని సమాచారం.