తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వచ్చే నెలలో రానున్న 'వర్జిన్ భానుప్రియ' - Virgin Bhanupriya cinema release date

తన కన్యత్వాన్ని వదులుకునేందుకు సిద్ధమైన కాలేజ్​ స్టూడెంట్​గా ఊర్వశి నటించిన 'వర్జిన్ భానుప్రియ' సినిమా.. వచ్చే నెల 16న ఓటీటీలో విడుదల కానుంది.

వచ్చే నెలలో రానున్న 'వర్జిన్ భానుప్రియ'
నటి ఊర్వశి రౌతేలా

By

Published : Jun 27, 2020, 10:11 AM IST

Updated : Jun 27, 2020, 12:46 PM IST

బాలీవుడ్‌ హాట్​బ్యూటీ ఊర్వశి రౌతేలా ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'వర్జిన్‌ భానుప్రియ'. ఇందులో ఊర్వశి కాలేజీ విద్యార్థినిగా కనిపించనుంది. సంప్రదాయంగా పెరిగిన ఈమెకు పాత పద్ధతులంటే అస్సలు ఇష్టముండదు. అందుకే తన కన్యత్వాన్ని వదులుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఈ క్రమంలో ఏం జరిగింది? అనేదే ఈ చిత్ర కథాంశం. జులై 16న జీ5 వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఊర్వశి.. పలు విషయాల్ని పంచుకుంది.

"కామెడీ చిత్రంగా తీసిన ఈ సినిమాలో స్త్రీ ఆకాంక్షకు అనుగుణంగా పితృస్వామ్యాన్ని అణిచివేసేందుకు నా పాత్ర ప్రయత్నిస్తుంది. చాలా వరకు యువతను ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రేక్షకులను వారాంతంలో బాగా నవ్విస్తుంది" -ఊర్వశి రౌతేలా, బాలీవుడ్ నటి

ఈసినిమాకు అజయ్‌ లోహన్‌ దర్శకత్వం వహించారు. ధారివాల్‌ ఫిల్స్మ్ ఆధర్వంలో హన్వంత్‌ ఖత్రి, లలిత్‌ కిరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 27, 2020, 12:46 PM IST

ABOUT THE AUTHOR

...view details