తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆ విషయంలో తారలకు ఎప్పుడూ ఒత్తిడే' - ఊర్వశి రౌతేలా

సోషల్ మీడియాలో ట్రోల్స్, నటీనటుల అందం గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది నటి ఊర్వశి రౌతేలా. ఈ భామ నటించిన 'వర్జిన్ భానుప్రియ' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Urvashi Rautela opens up on being actor
'హీరోయిన్లే కాదు..హీరోలూ అందంపై దృష్టి పెడుతున్నారు'

By

Published : Jun 8, 2020, 5:49 PM IST

Updated : Jun 8, 2020, 5:58 PM IST

సినీ తారలు ఎప్పుడూ అందంగా కనిపించాలని ఒత్తిడికి గురవుతుంటారని చెప్పింది బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా. హీరోయిన్లతో పాటు హీరోలు అందంగా కనిపించేందుకు కష్టపడుతున్నారని తెలిపింది. 'సింగ్‌ సాబ్‌ ది గ్రేట్‌' సినిమాతో అరంగేట్రం చేసిన ఈ భామ.. 2015లో భారతదేశం తరపున మిస్‌ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొంది. తాజాగా మాట్లాడుతూ అందంపై తనదైన శైలిలో స్పందించింది.

"సినీతారలు ఎప్పుడూ అందంగా కనిపించాలని ఒత్తిడికి గురవుతుంటారు. అయితే చాలామంది కథానాయికలే అందంగా కనిపించడానికి, ఒత్తిడిని ఎదుర్కొంటుంటారని అనుకుంటారు. అది నిజం కాదు. హీరోలూ అందంపై చాలా శ్రద్ధ చూపుతుంటారు. వాళ్లు నిత్యం అందంగా కనిపించాలంటే ఏమీ చేయాలనే ఆలోచనలతో మధనపడుతుంటారు. డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత తారలపై విపరీతంగా ట్రోల్స్ పెరుగుతున్నాయి. కనీసం మనపై ప్రతికూల వ్యాఖ్యలు రాకుండా ఉండాలంటే, సామాజిక మాధ్యమాల్లో కొంచెం అందంగా కనిపించాలి"

- ఊర్వశి రౌతేలా, బాలీవుడ్​ నటి

ఊర్వశి నటించిన 'వర్జిన్​ భానుప్రియ' చిత్రం ఓటీటీలో త్వరలో విడుదల కానుంది. లాక్​డౌన్​తో ఇంట్లోనే ఈమె.. సోషల్ మీడియాలో హాట్​హాట్ ఫొటోలు పెడుతూ, నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఇదీ చూడండి... నందమూరి బాలకృష్ణ పాడిన ఆ పాట ఏంటి?

Last Updated : Jun 8, 2020, 5:58 PM IST

ABOUT THE AUTHOR

...view details