తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఒక్క డ్యాన్స్ క్లాస్​తో​ రూ.5 కోట్లు సంపాదించిన ఊర్వశి - Urvshi dance class on instagram

కరోనాపై పోరాటంలో మద్దతుగా నిలిచింది బాలీవుడ్​ అందాల తార ఊర్వశి రౌతేలా. ఇన్​స్టాగ్రామ్​లో లైవ్​ డ్యాన్స్ ​క్లాస్​​ ద్వారా రూ. 5 కోట్ల విరాళాల్ని సేకరించింది.

Urvashi Rautela donates Rs 5 crore for Covid-19 relief
ఒక్క డాన్స్​క్లాస్​ రూ.5 కోట్లు సంపాదించిన నటి

By

Published : May 12, 2020, 6:24 PM IST

ప్రముఖ మోడల్, బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా తన అందంతోనే కాకుండా మంచి మనసుతోను ఆకట్టుకుంటోంది. ఈ అమ్మడు తాజాగా కరోనా వైరస్‌పై (కొవిడ్‌-19) పోరాటానికి తనవంతుగా ఐదు కోట్ల రూపాయాలు విరాళాన్ని ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 1.8 కోట్ల మంది ఫాలోవర్స్​ ఊర్వశికి ఉన్నారు. ఇంతమంది అభిమానుల సహకారంతో ఓ డ్యాన్‌ క్లాస్‌ని ఏర్పాటు చేసింది. దాంతో ఆమెకు వారి నుంచి భారీగా విరాళాలు అందాయి.

"ఇలాంటి కష్ట సమయాల్లో సాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. 2.5 కోట్ల మంది ఫాలోవర్స్​లో 1.8 కోట్ల మంది డ్యాన్స్‌ క్లాస్‌లో పాల్గొన్నారు. వారందరి సాయంతో 5 కోట్ల రూపాయలు వసూలు చేశాను. ఈ సాయం చిన్నదే కావచ్చు. మా ప్రయత్నం మాత్రం వృథా కాలేదు. కొవిడ్‌పై పోరాటానికి అందరి సాయం అవసరం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు."

- ఊర్వశి రౌతేలా, బాలీవుడ్​ నటి

'సింగ్‌ సాబ్‌ ది గ్రేట్‌' చిత్రంతో తెరంగేట్రం చేసిన ఊర్వశి, కన్నడలో 'మిస్టర్‌.ఐరావత'లో నటించింది. తర్వాత 'భాగ్‌ జానీ', 'కాబిల్‌' చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో చిందేసి మెప్పించింది. ప్రస్తుతం 'వర్జిన్‌ భానుప్రియ' అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. అజయ్‌ లోహన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2020 జూన్‌ 12న విడుదల కానుంది.

ఇదీ చూడండి.. అభిషేక్ స్టెప్పులు కాపీ కొట్టిన అమితాబ్​

ABOUT THE AUTHOR

...view details