నిజ జీవిత పాత్రల్లో నటించడం చాలా కష్టమని, సవాలు కూడకున్నదని నటి ఊర్వశి రౌతేలా చెప్పింది. ప్రస్తుతం 'ఇన్స్పెక్టర్ అవినాష్' వెబ్ సిరీస్‌లో రణ్‌దీప్ హుడా సరసన నటిస్తోంది. దాని గురించి విశేషాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.
బయోపిక్స్‌లో నటించడం ఆషామాషీ కాదు: ఊర్వశి - ఊర్వశి రౌతేలా న్యూస్
రియల్ లైఫ్ పాత్రల్ని వెండితెరపై పోషించడం చాలా కష్టమని నటి ఊర్వశి రౌతేలా చెప్పింది. వేరొకరి కథలో నటించడం చాలా పెద్ద బాధ్యత అని తెలిపింది.
"నిజజీవితంలోని ఓ వ్యక్తి పేర్రణతోనే ఈ సిరీస్‌లో పూనమ్ మిశ్రా పాత్ర చేస్తున్నాను. సూపర్ కాప్ అవినాష్ మిశ్రా భార్యగా నటిస్తున్నాను. సాధారణ పాత్రల కంటే బయోపిక్స్‌లో నటించడం ఆషామాషీ కాదు. వారి వ్యక్తిత్వాన్ని తెరపైకి తీసుకురావడం చాలా కష్టం. వేరొకరి కథను పోషించడం చాలా పెద్ద బాధ్యత. ఈ పాత్ర గురించి పూర్తిగా తెలుసుకోవడం కోసం పూనమ్‌తో చర్చించడం, వ్యక్తిత్వం, వేషధారణ, ప్రవర్తన లాంటి విషయాలు ఆమెకు దగ్గరగా ఉండేలా ప్రయత్నిస్తాను. నేను అవినాష్‌ను కలిసి ఆయన కుటుంబంతోనూ మాట్లాడాను" అని ఊర్వశి చెప్పింది.
'సింగ్ సాబ్ ది గ్రేట్' అరంగేట్రం చేసిన ఊర్వశి.. ఆ తర్వాత కన్నడ, హిందీ చిత్రపరిశ్రమలో పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది 'వర్జిన్ భానుప్రియ' అంటూ ప్రేక్షకుల్ని పలకరించింది. ప్రస్తుతం తెలుగులో 'బ్లాక్ రోజ్' చిత్రంలో నటిస్తోంది.