బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా పెళ్లి చేసుకుంది. సోషల్ మీడియాలో వచ్చిన ఓ ఫొటోను చూసిన ఆమె అభిమానులు ఇలానే అనుకుని షాకయ్యారు. లాక్డౌన్లో కనీసం సమాచారమైనా లేకుండా వివాహం జరిగిందా? ఎప్పుడు? ఎక్కడ? అని ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఇది 'వర్జిన్ భానుప్రియ' సినిమాలోని స్టిల్ అని తెలిసి సంతృప్తి చెందారు.
బిగ్బాస్ ఫేమ్ గౌతమ్ గులాటి, నటి ఊర్వశిని పెళ్లి చేసుకున్న ఫొటోను ఇన్స్టాలో ఇటీవలే పోస్ట్ చేశాడు. దీంతో షాక్ అయిన అభిమానులు.. అనంతరం ఇది సినిమా స్టిల్ అని తెలిసి అవాక్కయ్యారు. దీని గురించి చెబుతూ కామెంట్లు చేశారు.