తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'శృంగార తార' వ్యాఖ్యలపై స్పందించిన ఊర్మిళ - kangana bollywood

కంగన చేసిన వ్యాఖ్యల విషయంలో తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు చెప్పింది నటి ఊర్మిళ మతోండ్కర్. అభిమానం, ప్రేమ తన మనసును తాకాయంటూ ట్వీట్ చేసింది.

Urmila Matondkar thanks people for standing by her after Kangana Ranaut's foul comment
నటి ఊర్మిళ మతోండ్కర్

By

Published : Sep 18, 2020, 6:43 PM IST

'ఊర్మిళ శృంగార తార' అంటూ కంగనా రనౌత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. కొత్త వివాదానికి తెర లేపింది. ఆమెకు నటన రాదని, కేవలం శృంగార తారగా మాత్రమే గుర్తింపు పొందిందని విమర్శించింది. దీనిపై సోషల్‌మీడియాలో పెద్ద చర్చే జరిగింది. బాలీవుడ్‌ ప్రముఖులు, పలువురు నెటిజన్లు కంగనకు వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. ఈ సందర్భంగా తనవైపు నిలిచిన వారికి ఊర్మిళ ధన్యవాదాలు తెలిపింది.

'నాకు మద్దతు తెలిపిన 'రియల్ పీపుల్ ఆఫ్ ఇండియా'కు పక్షపాతంలేని, గౌరవ ప్రదమైన మీడియాకు ధన్యవాదాలు. తప్పుడు విమర్శలు, ప్రచారానికి వ్యతిరేకంగా ఇది మీరు సాధించిన విజయం. మీ అభిమానం, ప్రేమ నా మనసును తాకాయి. జై హింద్‌' అని ఊర్మిళ ట్వీట్‌ చేసింది.

మొదటి నుంచి బాలీవుడ్‌ ప్రముఖులపై కంగన విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. సుశాంత్‌ సింగ్‌ మరణం తర్వాత మరోసారి బీటౌన్‌పై విరుచుకుపడింది. ఈ క్రమంలో డ్రగ్స్‌ కోణం బయటపడం వల్ల ఆమె వ్యాఖ్యలు తీవ్రరూపం దాల్చాయి. మరోపక్క ముంబయి ప్రభుత్వం, శివసేన పార్టీ నాయకులపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో కంగనను ఉద్దేశిస్తూ ఊర్మిళ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 'భాజపా టికెట్‌ పొందేందుకే కంగన ఈ విధంగా మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబయి నగరం గురించి వివాదాస్పదంగా మాట్లాడుతున్నారు' అని చెప్పింది.

దీనిపై కంగన ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఊర్మిళ కామెంట్లు నా పోరాటాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయి. భాజపా టికెట్‌ పొందడం కోసమే నేను ఈ విధంగా పోరాటం చేస్తున్నానని ఆమె నాపై ఆరోపణలు చేశారు. ఒకవేళ నేను రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటే టికెట్‌ పొందడం నాకు అంతపెద్ద కష్టమేమీ కాదని తెలివైన వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటన వల్ల కాకుండా ఓ శృంగార తారగా మాత్రమే ఆమె ప్రజలకు సుపరిచితురాలైంది. అలాంటిది ఆమే టికెట్‌ పొందగలిగితే.. నేను ఎందుకు పొందలేను' అని వ్యాఖ్యానించింది.

ABOUT THE AUTHOR

...view details