భారత సైనిక దళం 2016 లో జరిపిన మెరుపు దాడుల నేపథ్యంతో తెరకెక్కిన చిత్రం 'ఉరీ- ద సర్జికల్ స్ట్రైక్'. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. ఈ ఏడాది కార్గిల్ దివస్ సందర్భంగా మహారాష్ట్రవ్యాప్తంగా 500 థియేటర్లలో మరోసారి విడుదల చేయనున్నారు.
"కార్గిల్ దివస్లో 'ఉరీ' భాగమైనందుకు నాకు ఆనందంగా ఉంది. భారతీయులందరిలోనూ ఈ చిత్రం స్ఫూర్తి కలిగిస్తుందని అనుకుంటున్నాను. మమ్మల్ని ప్రశంసిస్తూ చాలా సందేశాలు వచ్చాయి. చిత్రం చూసి సైనిక దళాల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని ఎందరో యువకులు మాకు ఈమెయిల్స్, మెసేజ్ల రూపంలో తెలిపారు." -ఆదిత్య, దర్శకుడు