టాలీవుడ్ నటుడు రాంచరణ్ సతీమణి ఉపాసన 65 మంది అపోలో కుటుంబసభ్యులతో కలిసి దుబాయ్ వెళ్లింది. భారతదేశంలో అత్యుత్తమ ఆక్యుపేషనల్ హెల్త్ కేర్ సర్వీస్ ప్రొవైడర్‌గా మంచి పేరున్న సంస్థ అపోలో లైఫ్. దాదాపు 32 మిలియన్ల మందికి ఇప్పటిదాకా సేవలు అందించింది. 2019-20 సంవత్సరానికి అపోలో లైఫ్‌కు సంబంధించిన కార్యాచరణ, ప్రణాళికలను చర్చించడానికే ఉపాసన కామినేని తన అపోలో లైఫ్ కుటుంబ సభ్యులను 65 మందిని దుబాయ్ తీసుకెళ్లింది.
అపోలో కుటుంబంతో దుబాయ్‌లో ఉపాసన - ఉపాసన కొణిదెల
రాంచరణ్ సతీమణి ఉపాసన బిజినెస్ సెమినార్ కోసం దుబాయ్ వెళ్లింది. 65 మంది అపోలో కుటుంబసభ్యులతో కలిసి సంస్థ కార్యచరణ, ప్రణాళికలపై చర్చించడానికి ఈ కార్యక్రమం నిర్వహించారు.
"నా కుటుంబం, కంపెనీ చాలా హ్యాపీగా ఉంది. దాదాపు 50 శాతం మంది మహిళలు ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతోనూ, గొప్ప విలువలతోనూ పనిచేస్తున్నారు. మా తాత డా.ప్రతాప్.సి.రెడ్డి ఆశీస్సులతో 2019-20 మరింత ఆశాజనకంగా, విజయవంతంగా ఉంటుందని నమ్ముతున్నాను"
ఉపాసన, రాంచరణ్ సతీమణి
ఎప్పుడూ కార్యాలయంలో కూర్చుని ఉండేవారు పనిచేసే ప్రదేశంలో మార్పు వస్తే మెదడు మరింత చురుగ్గా, నవ్యమైన ఆలోచనలతో వికసిస్తుందని ఉపాసన నమ్మకం. అందుకే సెమినార్లను కూడా వినూత్నంగా బస్సుల్లోనూ, ఎడారుల్లోనూ నిర్వహించారు.