'ఉప్పెన' చిత్రానికి సంబంధించిన మూడో పాట 'రంగులద్దుకున్న'ను సంగీత ప్రపంచానికి పరిచయం చేశారు టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు. సోషల్‌మీడియా వేదికగా ఈ పాటకు సంబంధించి లిరికల్ వీడియోను విడుదల చేశారు. సముద్ర తీరాన ఇసుక తిన్నెల్లో హీరోహీరోయిన్లుగా నటించిన వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి మధ్య సాగే ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని 'నీ కన్ను నీలి సముద్రం', 'ధక్ ధక్ ధక్' పాటలు విశేష ఆదరణ పొందాయి.
ఉప్పెన: 'రంగులద్దుకున్న' ప్రేమ గీతం - ranguladdukunaa song
దేవీశ్రీ సంగీతమందించిన 'ఉప్పెన' సినిమాలోని ప్రేమ గీతం 'రంగులద్దుకున్న'ను సూపర్‌స్టార్ మహేశ్ బాబు విడుదల చేశారు. శ్రోతలను ఆకట్టుకునేలా ఉందీ పాట. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని రెండు పాటలకు శ్రోతల నుంచి మంచి ఆదరణ లభించింది.

ఉప్పెన: 'రంగులద్దుకున్న' ప్రేమ గీతం
ప్రముఖ దర్శకుడు సుకుమార్ రచనా సహకారం అందించిన ఈ చిత్రం వేసవిలోనే విడుదల కావాల్సి ఉన్నా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. ఎప్పుడు విడుదల చేస్తారో ఇంకా స్పష్టత ఇవ్వలేదు చిత్రబృందం. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ఇందులో హీరోహీరోయిన్లుగా నటించారు. బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు.
ఇదీ చూడండి : 'ఆకాశం అమ్మాయైతే' పాట అలా పుట్టింది
Last Updated : Nov 11, 2020, 5:37 PM IST