తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబును ఓ ఖరీదైన కానుక వరించింది. వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టి జంటగా బుచ్చిబాబు తెరకెక్కించిన 'ఉప్పెన' ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. ఆ విజయంతో ఇప్పటికే వరుస సినిమా ఆఫర్లతో సంతోషంలో మునిగి తేలుతున్న బుచ్చిబాబు ఖాతాలో మరో కానుక వచ్చి చేరింది.
తమకు కలెక్షన్ల వర్షం కురిపించే సినిమా తీసినందుకు గాను.. సదరు చిత్ర నిర్మాణ సంస్థ 'మైత్రీ మూవీ మేకర్స్' ఒక బెంజ్ కారును బుచ్చిబాబుకు కానుకగా పంపించింది. ఆ కారు విలువ దాదాపు రూ.75లక్షలు ఉంటుందని అంచనా. ఈ మేరకు నిర్మాతలు నవీన్, రవిశంకర్ స్వయంగా బుచ్చిబాబుకు కారు అందజేసి అభినందించారు.