తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఉప్పెన' కథలో చిరంజీవి సలహా! - uppena release date

దర్శకుడిగా మారడానికి గల కారణాలను వివరించిన 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు.. తన సినిమా పరువుహత్యల నేపథ్య కథతో సాగేది కాదని చెప్పారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన సలహా ఎంతో ఉపయోగపడిందని అన్నారు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో దర్శకుడు 'ఈటీవీ భారత్'​తో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. పలు విశేషాలను పంచుకున్నారు.

uppena
ఉప్పెన

By

Published : Feb 10, 2021, 5:36 AM IST

Updated : Feb 10, 2021, 6:10 AM IST

తన సినిమా పరువుహత్య నేపథ్యంగా సాగే కథ కాదని 'ఉప్పెన' చిత్ర దర్శకుడు బుచ్చిబాబు స్పష్టం చేశారు. సుకుమార్ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన బుచ్చిబాబు.. ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా కథలో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన సలహా ఎంతో దోహదపడిందని ఆయన అన్నారు. హీరోయిన్​గా కృతిశెట్టిని ఎందుకు ఎంచుకున్నారో వివరించారు. మట్టిలో పుట్టిన తన కథకు ప్రేక్షకులు పట్టం కడతారనే ధీమాను వ్యక్తం చేశారు. దర్శకుడు సుకుమార్​తో తనకున్న బంధం గురించి చెప్పుకొచ్చారు.

బుచ్చిబాబు

'ఉప్పెన' కథ అలా పుట్టింది

"సుకుమార్‌ సర్‌ వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తరుణంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నా. ఏదైనా ఒక మంచి ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించాలని ఆశపడ్డా. అలా నాకు వచ్చిన ఆలోచనల్ని మొదట సుకుమార్‌కే చెప్పేవాడిని. ఆయన నన్ను ఎంతో ప్రోత్సహించేవారు. 'రంగస్థలం' షూట్‌లో ఉన్నప్పుడు నాకీ 'ఉప్పెన' ఆలోచన వచ్చింది. వెంటనే సుకుమార్‌తో చెప్పాను. చాలా బాగుంది. స్టోరీ, స్క్రీన్​‌ప్లేపై పూర్తిగా పనిచేయ్‌ అని అన్నారు. ఆరు నెలలు సమయం తీసుకుని పూర్తి కథ సిద్ధం చేసి మళ్లీ సుకుమార్‌ను కలిసి మొత్తం వివరించాను. ఆయన వెంటనే నన్ను గట్టిగా కౌగిలించుకుని.. 'సూపర్‌గా ఉంది. నువ్వు నా పెద్దకొడుకువిరా' అని అన్నారు. అది ఎప్పటికీ మర్చిపోలేని అపురూప జ్ఞాపకం." అని బుచ్చిబారు అన్నారు.

బుచ్చిబాబు

ఇదీ చూడండి: 'ఉప్పెన' దర్శకుడ్ని​ నీటిలో పడేసిన తారక్!

Last Updated : Feb 10, 2021, 6:10 AM IST

ABOUT THE AUTHOR

...view details