తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కృతిశెట్టి కోసం లేడీ ఓరియెంటెడ్​​​ కథ! - Krithi Shetty New Film

Krithi Shetty New Film: దర్శకుడు విరించి వర్మ.. యువ హీరోయిన్​ కృతిశెట్టి కోసం కథానాయిక ప్రాధాన్యం ఉన్న ఓ కథను సిద్ధం చేసినట్టు తెలిసింది. చిరు తనయ సుస్మిత ఈ మూవీని నిర్మించనున్నారట!

లేడి ఓరియేంటెడ్​​​ కథలో కృతిశెట్టి, kritishetty in lady oriented film
లేడి ఓరియేంటెడ్​​​ కథలో కృతిశెట్టి

By

Published : Dec 9, 2021, 6:31 AM IST

Updated : Dec 9, 2021, 9:12 AM IST

Krithi Shetty in Lady Orieneted Movie: కథానాయిక ప్రాధాన్యం ఉన్న కథలనగానే సీనియర్‌ భామలే గుర్తుకొస్తారు. బోలెడంత అనుభవం సంపాదించిన స్టార్‌ కథానాయికలకే అలాంటి అవకాశాలు దక్కుతుంటాయి. కానీ తొలి అడుగుల్లోనే కృతిశెట్టి కోసం అలాంటి ఓ కథ సిద్ధమైనట్టు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఆమె అందులో నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

రాజ్‌తరుణ్‌తో 'ఉయ్యాలా జంపాలా', నానితో 'మజ్ను' చిత్రాల్ని తెరకెక్కించిన విరించి వర్మ... కథానాయిక ప్రాధాన్యం ఉన్న ఓ కథని సిద్ధం చేసినట్టు తెలిసింది. ఆ కథ కోసం కృతిశెట్టిని ఎంపిక చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారని సమాచారం. చిరు తనయ సుస్మిత ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 'ఉప్పెన'తో తళుక్కున మెరిసిన కృతి.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న 'శ్యామ్‌ సింగరాయ్‌'లో నటించింది. 'బంగార్రాజు'లోనూ నాగచైతన్యకి జోడీగా నటిస్తోంది. సుధీర్‌బాబు, నితిన్‌లతోనూ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.

ఇదీ చూడండి: అలాంటి వాడు భర్తగా రావాలి: కృతి

Last Updated : Dec 9, 2021, 9:12 AM IST

ABOUT THE AUTHOR

...view details