యువ నటుడు శ్రీవిష్ణు, రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'గాలి సంపత్'. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి స్క్రీన్‌ప్లేతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. అనీష్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 11న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమాలోని మొదటి పాటను విడుదల చేయనుంది చిత్రబృందం. మంగళవారం (ఫిబ్రవరి 16) సాయంత్రం 4 గంటలకు సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారు నేచురల్ స్టార్ నాని.
సప్తగిరి, శ్రీనివాస రెడ్డి, తాగుబోతు రమేశ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రం 'హాస్ అరెస్ట్'. శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ నేడు (ఫిబ్రవరి 15) విడుదలైంది. ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉంటూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.
హీరోయిన్ నందితా శ్వేత ప్రధానపాత్రలో నటించిన కొత్త చిత్రం 'అక్షర'. చిన్ని దర్శకత్వంలో థ్రిల్లర్ కథాంశంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 26న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం (ఫిబ్రవరి 16) విడుదల చేయనున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమా ట్రైలర్‌ను సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్ చేయనున్నారు.