తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నా నటన చూసి ఏడ్చేశారు: కృతిశెట్టి - కృతిశెట్టి ఉప్పెన

'ఉప్పెన' ప్రీ-రిలీజ్​ ఈవెంట్​లో మెగాస్టార్​ చిరంజీవి తన నటనను మెచ్చుకోవడం గొప్ప అనుభూతినిచ్చిందని హీరోయిన్​ కృతిశెట్టి అన్నారు. ఆమె హీరోయిన్​గా అరంగేట్రం చేస్తున్న 'ఉప్పెన' చిత్రం ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా షూటింగ్​లోని అనుభవాలను కృతి మీడియాతో పంచుకున్నారు.

Uppena Beauty Krithi Shetty Interview
నా నటన చూసి ఏడ్చేశారు: కృతిశెట్టి

By

Published : Feb 9, 2021, 5:27 PM IST

నటన అంటే ఇష్టమే కానీ ఎప్పుడూ దాన్నే కెరీర్‌గా భావించలేదు అంటోంది యువ కథానాయిక కృతి శెట్టి. కొన్ని వాణిజ్య ప్రకటనల్లో నటించిన ఈ భామ 'ఉప్పెన'తో కథానాయికగా మారింది. వైష్ణవ్ తేజ్‌ హీరోగా బుచ్చిబాబు సానా తెరకెక్కించిన చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ నిర్మించాయి. ఫిబ్రవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా సినిమా, వ్యక్తిగత వివరాలను మీడియాతో పంచుకుంది కృతి శెట్టి. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.

కృతిశెట్టి

ఆ పేరు నాది కాదు..

నా వ్యక్తిగత సమాచారం కోసం చాలామంది గూగుల్‌లో వెతుకుతున్నారని తెలిసింది. వికీపీడియాలో కనిపించే అద్వైత అనే పేరు నాది కాదు. కృతి శెట్టి అనే మరో అమ్మాయి ఉంది. తను అలా పేరు మార్చుకుంది. ఆ ప్రొఫైల్‌ నాది కాదు. నటన అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఎప్పుడూ దాన్నే కెరీర్‌గా ఎంచుకుంటా అనుకోలేదు. నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్‌ కావాలని ఉండేది. అయితే నటన పట్ల ఉన్న ఇష్టాన్ని పక్కనపెట్టకుండా అప్పుడప్పుడు వాణిజ్య ప్రకటనల్లో నటించాను. వీటి వల్లే ఇప్పుడు సినిమా అవకాశం వచ్చింది. అయితే చదువు కారణంగా ముందు నటన వద్దనుకున్నాను. కానీ ఈ కథ నా మనసును హత్తుకోవడం వల్ల తప్పకుండా చేయాలనిపించింది.

కృతిశెట్టి

అది యాదృచ్ఛికమే..

నాలానే వైష్ణవ్‌ తేజ్‌కూ సినిమాలు చూడటం ఇష్టం లేదనే సంగతి ఈ మధ్యే తెలిసింది. అలాంటి మా ఇద్దరికీ ఇది తొలి సినిమా కావడం యాదృచ్ఛికమే. అలా అని చెప్పి, ఏదో నటించేద్దాం అనుకోకుండా పాత్రకు తగినట్టు నన్ను నేను మార్చుకున్నాను. బేబమ్మ (నాయిక పాత్ర పేరు) నేనే అనుకుని నటించాను. నా వ్యక్తిగత జీవితానికి కొంచెం దగ్గరగా ఉంటుందీ పాత్ర. అందుకే సహజంగా, సులభంగా చేయగలిగాను. దర్శకుడు నాతో తెలుగులో మాత్రమే మాట్లాడేవారు. ఆ సమయంలో ఆయన్ని బాగా పరిశీలించేదాన్ని. నేను తెలుగు నేర్చుకునేందుకు వైష్ణవ్‌, సహాయక దర్శకులు, సెట్‌లో ప్రతి ఒక్కరూ సహకరించారు. అందుకే ఇంత త్వరగా వచ్చేసింది. సినిమా చిత్రీకరణకు ముందు ఐదు రోజుల వర్క్‌ షాప్‌లో పాల్గొన్నాను.

కృతిశెట్టి

ఎప్పటికీ మరిచిపోలేను..

సినిమాలో ఓ ఎమోషనల్‌ సన్నివేశం చిత్రీకరణ పూర్తయ్యాక మోనిటర్‌లో ఔట్‌పుట్‌ చెక్‌ చేస్తుంటే ఛాయాగ్రాహకుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సమయంలో నటిగా చాలా గర్వంగా అనిపించింది. అక్కడున్న ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకోవడం ఎప్పటికీ మరిచిపోలేను. సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో చిరంజీవిగారు నా నటనను మెచ్చుకోవడం మరో గొప్ప అనుభూతి. ఈ సినిమాకు సంతకం చేయకముందు నాకు ఏ దర్శకులు, హీరోలూ తెలియదు. చిరంజీవిగారు మాత్రమే తెలుసు. సుకుమార్‌ గారిని కలిసినపుడు కొంత ధైర్యం వచ్చింది. నేను టీవీలో వచ్చే సినిమాలు చూడటం తప్ప, బయటకెళ్లి చూసింది లేదు.

కృతిశెట్టి

ఇద్దరూ చాలా సింపుల్‌..

విజయ్‌ సేతుపతి, వైష్ణవ్‌ ఇద్దరూ చాలా సింపుల్‌గా ఉంటారు. సెట్‌లో ఇద్దరితో చాలా సౌకర్యవంతంగా ఉండేదాన్ని. సినిమాలో నాకు, సేతుపతి గారి మధ్య పెద్ద సన్నివేశం ఉంది. ఆయనతో ఎలా నటించాలో అనే భయం మొదట్లో ఉండేది. నా పరిస్థితిని గమనించిన ఆయన.. ఎలా నటిస్తే బాగుంటుందో చెప్పి, ఆ సీన్‌ బాగా వచ్చేలా సాయం చేశారు.

కృతిశెట్టి

"కృతి 11 ఏళ్ల వయసులోనే వాణిజ్య ప్రకటనలో నటించింది. ఓసారి యాడ్‌ ఫిల్మ్‌ కోసం హైదరాబాద్‌ వచ్చినపుడు దర్శకుడు బుచ్చిబాబు కలిశారు. ఆయన చెప్పిన కథ ఆకట్టుకుంది. పైగా మెగా కుటుంబం నుంచి వస్తున్న కథానాయకుడు కావడం మరో అడ్వాంటేజ్‌ అనిపించింది. ఇంతకన్నా ఇంకేం కావాలి.. నాయికగా పరిచయం అయ్యేందుకు అనుకొని కృతి శెట్టి ఒప్పుకుంది. ఇంత బాగా నటిస్తుందని నేనూ అనుకోలేదు. కృతిని తెరపై చూసినపుడు చాలా సంతోషం కలిగింది. చిత్రీకరణ సమయంలో నేను కృతితోనే ఉన్నాను. తన కోసం నా జాబ్‌ను వదిలేశాను. తన నటనతో మా కష్టాన్నంతా మర్చిపోయేలా చేసింది. ప్రస్తుతం సైకాలజీ చదువుతోంది. చదువులోనూ చురుకుగా ఉంటుంది".

- నీతూ శెట్టి, కృతి శెట్టి తల్లి

కృతి గురించి సూటిగా..

  • స్వస్థలం బెంగళూరు. అయితే పెరిగిందంతా ముంబయిలోనే.
  • కృతిశెట్టి నాన్న వ్యాపారవేత్త, అమ్మ ఫ్యాషన్‌ డిజైనర్‌.
  • కృతికి మెథడ్‌ యాక్టింగ్‌ అంటే ఇష్టం.
  • శ్రీదేవి, సమంత.. నటనలో వీళ్లే కృతికి స్ఫూర్తి.
  • చికెన్‌ అంటే చాలా ఇష్టం. డ్యాన్స్‌ చేయడం కృతికి హాబీ.

ఇదీ చూడండి:'నాట్యం' సినిమాకు ఎన్టీఆర్​ వాయిస్​ ఓవర్!

ABOUT THE AUTHOR

...view details