తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కొత్త చిత్రం: 'కబ్జా' చేయనున్న ఉపేంద్ర..! - కన్నడ సినిమా

హీరో అయినా... విలనైనా ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతాడు కన్నడ హీరో ఉపేంద్ర. ప్రస్తుతం ఉపేంద్ర కథానాయకుడిగా 'కబ్జా' అనే చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్​ త్వరలో ప్రారంభం కానుంది.

Upendra-New Movie-KABJA-FirstLook
కబ్జా సినిమా ఫస్ట్​లుక్​

By

Published : Dec 25, 2019, 6:01 AM IST

ఉపేంద్ర.. అనే కన్నా ఫ్యాక్షన్​ లీడర్​ దేవరాజు నాయుడు అంటేనే తెలుగు ప్రేక్షకులు తొందరగా గుర్తుపడతారు. 'సన్నాఫ్​ సత్యమూర్తి'లో ఉపేంద్ర ఫ్యాక్షన్ లీడర్​గా ఎంతగానో అలరించాడు. 'ఉపేంద్ర', 'రా..' 'ఏ', 'ఓంకారం', 'కన్యాదానం' లాంటి చిత్రాల్లో ఉపేంద్ర తన నటనతో ఆకట్టుకున్నాడు. తాజాగా మరో విభిన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

కబ్జా సినిమా ఫస్ట్​లుక్​

ప్రముఖ కన్నడ డైరెక్టర్​ ఆర్​. చంద్రు దర్శకత్వంలో 'కబ్జా' అనే చిత్రంలో కథానాయకుడిగా నటించనున్నాడు. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి రామోజీ ఫిల్మ్​ సిటీలో కొన్ని పోరాట సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. అనంతరం బెంగళూరు పరిసర ప్రాంతాల్లో సినిమా తెరకెక్కిస్తారు.

ఆర్​. చంద్రు గతంలో 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' అనే తెలుగు చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాలో సుధీర్​బాబు, నందితా రాజ్​ హీరో-హీరోయిన్లుగా నటించారు.

ఇదీ చదవండి:- మహాభారతంలో కృష్ణుడు-ద్రౌపదిగా నటించేది వీళ్లేనా?

ABOUT THE AUTHOR

...view details